న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనత

Rohit Sharma Played 95 One Day Matches After August 2017 || Oneindia Telugu
Rohit Sharma played 95 one day matches after one August 2017 most ODIs

టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. 2017 అగస్టు 1 నుంచి ప్రపంచకప్‌-2019 ముగిసేవరకు అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. 2017 నుండి ప్రపంచకప్‌ వరకు 95 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 2017 అగస్టు నుంచి టీమిండియా 111 వన్డేలు ఆడగా.. రోహిత్‌ 95 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. కేవలం 16 మ్యాచ్‌లలో మాత్రమే రోహిత్ ఆడలేదు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్‌ సారధ్య భాద్యతలు చేపడుతూ ఎక్కువ వన్డేలు ఆడాడు. ఇలాంటి ఘనత అందుకున్న ఒకే ఒక్క ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరోవైపు 2017 అగస్టు నుంచి టీమిండియా 111 వన్డేలు ఆడింది. దీంతో ఈ వ్యవధిలో అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన జట్టుగా టీమిండియా (111) నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ (89), శ్రీలంక (88), పాకిస్తాన్‌ (88) జట్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

రోహిత్‌ శర్మ ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. రోహిత్‌ 5 సెంచరీలతో రికార్డు నెలకొల్పాడు. ఓ ప్రపంచకప్‌లో అత్యధికంగా సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. టోర్నీలో 648 పరుగులతో టాప్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇదే ఆటను వెస్టిండీస్‌ పర్యటనలో కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడునుంది.

Story first published: Thursday, July 25, 2019, 12:06 [IST]
Other articles published on Jul 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X