న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా వన్డే కేప్టెన్‌గా రోహిత్ శర్మ: విరాట్ కోహ్లీ వారసుడిగా హిట్‌మ్యాన్: బీసీసీఐ ప్రకటన

Rohit Sharma named as the New ODI captain of India cricket team

ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ నియమితుడైన తరువాత.. కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. అతని ఆలోచనలకు అనుగుణంగా జట్టును తీర్చిదిద్దడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రాధాన్యత ఇస్తోంది. వన్డే ఇంటర్నేషనల్స్‌ ఫార్మట్ జట్టుకు కూడా కొత్త కేప్టెన్‌ను అపాయింట్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు కేప్టెన్‌గా ఉంటోన్న విరాట్ కోహ్లీని తప్పించి- ఆ స్థానంలో మరో సీనియర్ బ్యాటర్‌కు జట్టు పగ్గాలను అప్పగించే దిశగా పావులు కదుపుతోంది.

రోహిత్ శర్మకే పగ్గాలు..

రోహిత్ శర్మకే పగ్గాలు..

ఆ సీనియర్ బ్యాటర్ ఎవరో తేలిపోయింది. సాయంత్రానికే ఆ బ్యాటర్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతను మరెవరో కాదు.. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. 50 ఓవర్ల ఫార్మట్‌ కేప్టెన్సీ పగ్గాలను కూడా రోహిత్ శర్మకే అప్పగించింది బీసీసీఐ. భారత క్రికెట్ జట్టు వన్డే కేప్టెన్‌గా రోహిత్ శర్మ నియమితుడయ్యాడు. అతనికే సారధ్య బాధ్యతలు దక్కాయి. విరాట్ కోహ్లీ వారసుడిగా హిట్‌మ్యాన్‌ను ఎంపిక చేసింది. మరొకరి పేరును కనీసం పరిశీలనలో కూడా తీసుకోలేదు బీసీసీఐ.

ఇప్పటికే టీ20ల్లో సత్తా చాటిన రోహిత్..

ఇప్పటికే టీ20ల్లో సత్తా చాటిన రోహిత్..

ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 ఫార్మట్‌ కేప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ ఫార్మట్ కేప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఎదుర్కొన్న తొలి సీరిస్‌లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో బలమైన న్యూజిలాండ్‌ను మట్టి కరిపించాడు. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టును మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్ వాష్ చేసి పారేశాడు. 3-0తో ఆ సిరీస్‌ను గెలుచుకుంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు. ఇది అతని సత్తాను మరోసారి చాటి చెప్పినట్టయింది.

వన్డేల్లోనూ అదే దూకుడు..

వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ రోహిత్ శర్మ అదే దూకుడును కొనసాగించగలుగుతాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే- విరాట్ కోహ్లీ వారసుడిగా అతన్ని ఎంపిక చేసింది. 50- ఓవర్ల ఫార్మట్ కేప్టెన్‌గా రోహిత్ శర్మ కేరీర్.. దక్షిణాఫ్రికా సిరీస్‌తో ఆరంభం కానుంది. 50-ఓవర్ల వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మట్‌కు రోహిత్ శర్మ కేప్టెన్‌గా ఉంటాడు. టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ కేప్టెన్‌గా కంటిన్యూ అవుతాడు. వైస్ కేప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడు.

కేప్టెన్‌గా ముగిసిన కోహ్లీ శకం..

కేప్టెన్‌గా ముగిసిన కోహ్లీ శకం..

రోహిత్ శర్మ అపాయింట్‌మెంట్‌తో వన్డేల్లోనూ విరాట్ కోహ్లీ కేప్టెన్సీ శకం ముగిసినట్టయింది. అతను టెస్ట్ ఫార్మట్‌కు మాత్రమే సారథిగా ఉంటాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు విరాట్. విరాట్‌తో సమానంగా, ఆ మాట కొస్తే మరింత నిలకడగా రాణించే సత్తా రోహిత్ శర్మకు ఉందని బీసీసీఐ భావించింది. అతనిలా మరో సీనియర్ బ్యాటర్ ఎవరూ జట్టులో లేకపోవడం, నిలకడగా రాణిస్తోండటం, పార్ట్‌టైమ్ కేప్టెన్‌గా సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డును కలిగి ఉండటం.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని రోహిత్ శర్మను వన్డే ఇంటర్నేషనల్స్ సారథిగా అపాయింట్ చేసింది.

Story first published: Wednesday, December 8, 2021, 20:17 [IST]
Other articles published on Dec 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X