న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిద్దరూ నా నమ్మకాన్ని నిలబెట్టారు : రోహిత్ శర్మ

Rohit Sharma Lavishes Praise on Kuldeep Yadav and Yuzvendra Chahal After Indore Win

హైదరాబాద్: వరుస విజయాలు సాధిస్తూన్న ప్రస్తుత భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ జట్టు ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెస్తున్నాడు. భారత యువ స్పిన్నర్లు కుల్‌దీప్‌, చాహల్‌ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుతారన్న నమ్మకం ఉందని అభిప్రాయపడ్డాడు.
శుక్రవారం డిసెంబరు 22న హోల్కర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో విజయాన్ని కైవసం చేసుకున్న భారత సారథి తన జట్టు గురించి ప్రశంసిస్తున్నాడు.

ఇండోర్‌లో లంకతో జరిగిన రెండో టీ20లో బ్యాట్స్‌మెన్‌లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. వీరితో సమంగా ఇద్దరు స్పిన్నర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శించారు. ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి సగభాగమయ్యారు.

ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం భారత్‌ తరఫున కుల్‌దీప్‌, చాహల్‌ అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. వీరిద్దరిపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. మ్యాచ్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వీరు తమ స్పిన్‌ మాయాజాలంతో తమ వైపుకు తిప్పేయగలరని నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.

వాళ్లిద్దరూ భారత్ జట్టులో ఉన్నాన్నాళ్లు బౌలింగ్ గురించి ఎలాంటి ఒత్తిడికి గురికావాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డాడు. ఇండోర్‌లో కుల్‌దీప్‌ 52/3 వికెట్లు తీసి తన సత్తా నిరూపించుకున్నాడని వెలిబుచ్చాడు. అలాగే చాహల్‌ మంచి ప్రదర్శన చేశాడు. అందుకే వారిపై తనకు పూర్తి నమ్మకముందున్నాడు.

అనంతరం శ్రీలంక సారధి ధిసారా పెరీరా మాట్లాడుతూ..'ఈ సిరీస్‌లో భారత్‌ను అందుకోలేకపోతున్నాం. ఉపుల్‌ తరంగ, కుశాల్‌ పెరీరా బాగా ఆడారు. కాకపోతే ఈ మ్యాచ్‌లో మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. గాయంతో మాథ్యూస్‌ ఇక ఈ సిరీస్‌కు దూరమైనట్లే. దీంతో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయాం' అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ తన బ్యాట్‌తో వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. కేవలం 43 బంతుల్లో రోహిత్‌ 118 పరుగులు సాధించి అంతర్జాతీయ టీ20ల్లో రెండు సెంచరీలు బాదిన భారత ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ ఆదివారం ముంబయిలో జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో భారత్‌ ఇప్పటికే కైవసం చేసుకుంది.

ముంబై వేదికగా ఆదివారం భారత్ -శ్రీలంకతో మూడో వన్డే ఆడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 23, 2017, 11:42 [IST]
Other articles published on Dec 23, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X