వాంఖడె స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రోహిత్ శర్మ రికార్డు ఇలా

Posted By:
Rohit Sharma: Hitman At Wankhede Against Chennai Super Kings

హైదరాబాద్: మరికొద్ది గంటల్లో క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 11వసీజన్‌కు తెరలేవనుంది. మొత్తం 51 రోజులు పాటు జరిగే ఈ ఐపీఎల్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. 9 ప్రధాన నగరాల్లో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్‌లో అత్యధికంగా మూడుసార్లు టైటిల్‌ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలవగా, లీగ్‌లో ఆడిన ప్రతిసారీ కనీసం ప్లేఆఫ్‌‌కు చేరిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్.

అంతేకాదు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండుసార్లు టైటిల్‌ సాధించి, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అలాంటి చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తుండగా... ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే చెన్నైపై రోహిత్‌ ప్రదర్శన పేలవంగా ఉంది.

దీంతో తొలి మ్యాచ్‌లోనైనా రోహిత్‌ శర్మ తన మెరుపులతో మెరుస్తాడా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ రెండు జట్ల మద్య జరిగిన పోరులో రోహిత్‌ శర్మ, చెన్నైపై రెండో అత్యధిక పరుగులు(535) నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

 706 పరుగులతో అగ్రస్థానంలో కోహ్లీ

706 పరుగులతో అగ్రస్థానంలో కోహ్లీ

కోహ్లీ (706) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక, ఐపీఎల్ విషయానికి వస్తే ఇప్పటివరకు 159 మ్యాచ్‌ల్లో 3037 పరుగులు చేసిన రోహిత్ శర్మ 32.61 సగటు, 130.89 స్ట్రైక్‌ రేటు నమోదు చేశారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ 535 పరుగులు చేశారు. సగటు 28.15, స్ట్రైక్‌ రేట్‌ 124.12 నమోదు చేశారు.

 చెన్నైపై అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్లు:

చెన్నైపై అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్లు:

1. 706 - విరాట్ కోహ్లీ
2. 535 - రోహిత్ శర్మ
3. 492 - రాబిన్ ఊతప్ప
4. 480 - షేన్ వాట్సన్
5. 448 - శిఖర్ ధావన్

వాంఖడెలో చెన్నైపై రోహిత్ శర్మ రికార్డు ఇలా

వాంఖడెలో చెన్నైపై రోహిత్ శర్మ రికార్డు ఇలా

తొలి మ్యాచ్ జరుగుతోన్న వాంఖడె స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆరు మ్యాచ్‌ల్లో తలపడిన రోహిత్‌ శర్మ 54.80 సగటుతో 274 పరుగులు చేశారు. ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ నాలుగు సార్లు 30పరుగులు పైగా నమోదు చేయగా, ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

చివరిసారిగా 2015, మే 24న తలపడ్డ చెన్నై-ముంబై

ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు గత పదేళ్ల ఐపీఎల్ సీజన్‌తో పాటు ఛాంపియన్‌ లీగ్‌ టీ20ల్లో 24 సార్లు తలపడగా ముంబై 13 మ్యాచ్‌లు, చెన్నై 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. చివరిసారిగా ముంబై-చెన్నై జట్ల మధ్య 2015 మే 24న ఐపీఎల ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసకుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 7, 2018, 15:20 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి