న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డకౌట్ జాబితాలో అందరి కంటే టాప్‌ స్థానంలో రోహిత్ శర్మ

Rohit Sharma creates unwanted record after being dismissed for golden duck in 2nd T20I at Centurion

హైదరాబాద్: గొప్ప రికార్డులతో పాటు చెత్త రికార్డులను వదిలిపెట్టడం లేదు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మూడుసార్లు ద్విశతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. వీటితో పాటు మరో చెత్త రికార్డు వచ్చి చేరింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు డకౌట్‌ అయిన జాబితాలో రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు.

ఆతిథ్య దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన టీ20లో ఎదుర్కొన్న తొలి బంతికే రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. దీంతో భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు మొత్తం నాలుగు సార్లు రోహిత్‌ పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు.

అతని తర్వాతి స్థానాల్లో యూసుఫ్‌ పఠాన్‌(3), ఆశిష్‌ నెహ్రా(3) ఉన్నారు. దీంతో నెటిజన్లు 'బ్యాట్స్‌మెన్‌ ఆఫ్‌ ది డే.. రోహిత్‌ శర్మ; ఈ సిరీస్‌లో డకౌట్‌ అయిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌' అని కామెంట్లు పెడుతున్నారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో ఆది నుంచి రోహిత్‌ తడబడుతూనే ఉన్నాడు. టెస్టు, వన్డేల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకోయాడు. పోర్ట్‌ఎలిజబెత్‌లో జరిగిన వన్డేలో మాత్రం రోహిత్‌ శతకం సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇది తప్ప సఫారీ గడ్డపై రోహిత్‌ శర్మ గురించి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఒక్కటి కూడా లేదు.
ఇక, దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిదైన టీ20 ఈ శనివారం కేప్‌టౌన్‌లో జరగనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారు 2-1తో సిరీస్‌ విజేతగా నిలుస్తారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సముజ్జీవులుగా నిలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, February 22, 2018, 13:32 [IST]
Other articles published on Feb 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X