న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లను దాటేసిన రోహిత్

Rohit Sharma breaks Yuvraj Singh’s record of most sixes by an Indian in T20Is

హైదరాబాద్: పేలవ ప్రదర్శన అని విమర్శిస్తున్న తరుణంలో రోహిత్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి అందరి నోళ్లు మూయించాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ విరామంలో ఉండగా తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ ఈ ముక్కోణపు టోర్నీ తొలి మ్యాచ్ నుంచి ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతని స్థానం మిడిలార్డర్‌కు మార్చే ఆలోచనలో పడ్డాయి మేనేజ్‌మెంట్ వర్గాలు.

కొలంబో వేదికగా జరిగిన టీ20 ట్రైసిరీస్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం బంగ్లాతో భారత జట్టు తలపడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ 61 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజృంభించిన రోహిత్ తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (74) బాదిన భారత బ్యాట్స్‌మన్‌గా సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.

బుధవారం టీ20లో 5 సిక్సులు కొట్టడంతో రోహిత్ ఖాతాలో సిక్సర్ల సంఖ్య 75 చేరింది. టీమిండియా తరఫున సురేశ్ రైనా(54), మహేంద్రసింగ్ ధోనీ(46), విరాట్ కోహ్లీ(41) అత్యధిక సిక్సులు బాదిన వారిలో తరువాతి స్థానాల్లో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది. 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

యువరాజ్ సింగ్‌తో పాటు టీ 20ల్లో అత్యధిక సిక్సులు బాదిన భారత క్రికెటర్లు సురేశ్ రైనా (54), మహేంద్ర సింగ్ ధోనీ(46), విరాట్ కోహ్లీ (41), సచిన్ టెండూల్కర్ (56)లుగా ఉన్నారు. ఏబీ వివిలియర్స్ రికార్డు(63)ను రోహిత్ శర్మ 2015లోనే దాటేశాడు.

Story first published: Thursday, March 15, 2018, 11:04 [IST]
Other articles published on Mar 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X