న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ హిట్‌మ్యాన్‌గా అవతరించడానికి కారణం..అతనొక్కడే: ప్రజ్ఞాన్ ఓఝా సంచలనం

Rohit Sharma because a great leader for MI, the credit should go to Adam Gilchrist: Pragyan Ojha

ముంబై: రోహిత్ శర్మ..టీమిండియా డాషింగ్ ఓపెనర్. అన్ని ఫార్మట్ల క్రికెట్‌ను అవలీలగా ఆడేయగల సమర్థుడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో డబుల్ సెంచరీని ఊది పడేసిన బ్యాటింగ్ మెషీన్. భారత క్రికెట్ జట్టు టీ20 ఫార్మట్ కేప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించాడు. ఆ వెంటనే టీమిండియాకు టీ20 సిరీస్‌ను అందించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు. ఈ సాయంత్రం మూడో మ్యాచ్‌ను ఆడనుంది. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.

రోహిత్ శర్మకు ఉన్న నిక్ నేమ్.. హిట్ మ్యాన్. అభిమానులు అతన్ని హిట్‌మ్యాన్‌గా పిలుచుకుంటుంటారు. అతను ఆడే షాట్లు అలాంటివి. ఖచ్చితత్వంతో కూడున్న షాట్లను ఆడటంలో దిట్ట. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో సత్తా చాటుతున్నాడు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్ జట్టును అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ ఘనతను సాధించిన మరో టీమ్ ఐపీఎల్‌లో లేదు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు టైటిళ్లతో రెండో స్థానంలో నిలిచింది.

రోహిత్ శర్మ ఐపీఎల్ ప్రయాణం.. ఒకప్పటి దక్కన్ ఛార్జర్స్‌తో ఆరంభమైంది. దక్కన్ ఛార్జర్స్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌, షాహిద్ అఫ్రిదీ, డారెన్ లీమన్, ఆండ్రూ సిమండ్స్, హెర్ష్‌లె గిబ్స్, డేల్ స్టెయిన్ వంటి హేమాహేమీలతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. వారి అనుభవాలు.. రోహిత్ శర్మ కేరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. రోహిత్ శర్మలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని మొదట గుర్తించింది గిల్ క్రిస్ట్.

ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. గిల్‌క్రిస్ట్ మాత్రం రోహిత్ శర్మను ప్రోత్సహించే వాడని మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా చెప్పాడు. ఓఝా కూడా దక్కన్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు. ముంబై ఇండియన్స్ కేప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుత విజయాలను సాధించాడని, ఆ అనుభవంతోనే టీమిండియా టీ20 ఫార్మట్‌కు నాయకత్వాన్ని వహిస్తున్నాడని పేర్కొన్నాడు. ధనాధన్ ఫార్మట్‌లో జట్టును లీడ్ చేసే స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారకుడు గిల్‌క్రిస్టేనని వివరించాడు.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన ఓ స్టోరీని అతను పోస్ట్ చేశాడు. రోహిత్ శర్మలో ఉన్న నాయకత్వ లక్షణాలు, బ్యాటింగ్ తీరు, క్రీజ్‌లో అతని స్టాండ్.. ఇవన్నీ గిల్‌క్రిస్ట్ నిశితంగా పరిశీలించేవాడని, దానికి అనుగుణంగా సలహాలను ఇచ్చేవాడని ఓజా చెప్పాడు. అతనిలో ఉన్న దూకుడు స్వభావానికి ఆస్ట్రేలియన్ మాజీ వికెట్ కీపర్.. మరింత మెరుగుల దిద్దాడని పేర్కొన్నాడు. అదే రోహిత్ శర్మను ఇవ్వాళ ఈ స్థాయికి చేర్చాయని అన్నాడు.

Story first published: Sunday, November 21, 2021, 14:05 [IST]
Other articles published on Nov 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X