న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: ఒకే తరహాలో వికెట్‌ సమర్పించుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త రికార్డు

Rohit became the first Indian batsman to be stumped in both the innings of a Test match

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులతో పాటు రికార్డుల మోత మోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ(176) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.

ఈ టెస్టులో రోహిత్ శర్మకు ఇది వరుసగా రెండో సెంచరీ. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. ఈ క్రమంలో రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్టులో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

1
46113

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ రికార్డు బద్దలు

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్లర్‌ వెసెల్స్‌(208) పేరిట ఉన్న రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. విశాఖ టెస్టులో రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేసి ఔటైన సంగతి తెలిసిందే. ఫలితంగా ఒక టెస్టులో అరంగేట్రపు ఓపెనర్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్(303) రికార్డు నెలకొల్పాడు.

ఒక టెస్టులో మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు

ఒక టెస్టులో మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు

దీంతో పాటు ఒక టెస్టులో మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు కొట్టిన రోహిత్‌ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు బాదాడు. ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్(12 సిక్సుల) రికార్డుని బద్దలు కొట్టాడు.

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

ఈ జాబితాలో నాథన్ ఆస్ట్లే(11), బ్రెండన్ మెక్‌కల్లమ్(11), మ్యాథ్యూ హెడెన్(11), బెన్ స్టోక్స్(11) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు భారత్ తరుపున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల క్రితం నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నెలకొల్పిన రికార్డుని బద్దలు కొట్టాడు.

రోహిత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఔటైన తీరు కూడా అతడికి ఓ రికార్డుని తెచ్చిపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఔటైన రోహిత్ శర్మ.... రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడి బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. రోహిత్‌ ముందుకొచ్చిన రెండు సందర్భాల్లోనూ వికెట్‌ కీపర్‌ డీకాక్‌ స్టంపౌట్ చేశాడు. ఒక టెస్టులో ఒకే బౌలర్‌కు ఒకే తరహాలో వికెట్‌ సమర్పించుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

Story first published: Saturday, October 5, 2019, 16:58 [IST]
Other articles published on Oct 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X