న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ బాధలో బిల్డింగ్‌పై నుంచి దూకి చావాలనుకున్నా.. 1,2,3 కూడా లెక్కపెట్టా: ఊతప్ప

Robin Uthappa opens up on his battle against depression

బెంగళూరు: భారత జట్టుకు దూరమైన ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప తెలిపాడు. క్రికెట్ మ్యాచ్‌లు లేక ఖాళీగా ఇంట్లో కూర్చోవడంతో చచ్చిపోవాలనే ఆలోచనలు ఎక్కువగా వచ్చేవన్నాడు. ప్రతీ రోజూ నరకం అనుభవించేవాడినని, భవిష్యత్తు తలుచుకొని తీవ్రంగా మధనపడేవాడినని ఊతప్ప గుర్తుచేసుకున్నాడు.

రాయల్‌ రాజస్తాన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన మైండ్‌, బాడీ, సోల్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఊతప్ప.. తనకు ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు. 'నేను 2006లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేశా. అప్పుడు నా గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పటి నుంచి నేర్చుకోవడం ఆరంభించా. ప్రస్తుతం నా గురించి నాకు బాగా తెలుసు. నా ఆలోచనల్లో క్లారిటీ ఉంది. నేను కిందికి పడిపోతుంటే ఎలా పైకి వెళ్లాలనే దానిపై అవగాహన ఉంది. నేను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నానంటే చాలా అడ్డంకులు దాటుకుంటూ వచ్చాను.

ఒకానొక సమయంలో పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అప్పుడు సూసైడ్‌ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి. ముఖ్యంగా 2009 నుంచి 2011 మధ్య నా జీవితంలోనే అత్యంత గడ్డుకాలాన్ని చూశా. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తీవ్రంగా బాధపడేవాడిని. ఒక రోజు తీవ్ర బాధతో బాల్కనీ నుంచి దూకాలనుకున్నాను. కానీ ఎదో శక్తి నన్ను వెనక్కు నెట్టింది.

క్రమేపీ నాకు నేనుగా మెరుగుపడుతూ ఆ ఆలోచనలు నుంచి బయటకొచ్చా. ఇప్పుడు కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం లేదు. పలు విషయాలపై దృష్టి సారిస్తూ నా మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతున్నాను. నేను వెళ్లే మార్గం సరైనదా.. కాదా అని అన్వేషించుకుంటూ నా రోటీన్‌ లైఫ్‌లో ముందుకు సాగుతున్నా' అని ఊతప్ప తెలిపాడు. ఇక ఊతప్ప తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.

అలా అయితేనే కోహ్లీ 100 సెంచరీలు చేయగలడు: మాజీ క్రికెటర్అలా అయితేనే కోహ్లీ 100 సెంచరీలు చేయగలడు: మాజీ క్రికెటర్

Story first published: Thursday, June 4, 2020, 15:46 [IST]
Other articles published on Jun 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X