తండ్రి అయిన రాబిన్ ఊతప్ప: విషెస్ చెప్పిన అశ్విన్, రైనా

Posted By:

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తండ్రయ్యాడు. మంగళవారం రాబిన్ ఊతప్ప భార్య శీతల్‌ గౌతమ్‌ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని రాబిన్ ఊతప్ప బుధవారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

మా తొలి సంతానానికి నీల్ నోల్ ఊతప్ప అని నామకరణం చేసినట్లు ఊతప్ప అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం సౌరాష్ట్ర తరఫున రంజీలు ఆడుతున్న రాబిన్ ఊతప్ప ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. తండ్రి అయిన రాబిన్ ఊతప్పకు తన సహచర క్రికెటర్లు అశ్విన్, సురేశ్ రైనా అభినందనలు తెలియజేశారు.

ఇదిలా ఉంటే యాదృచ్ఛికంగా అదే రోజున పాకిస్తాన్‌ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్మల్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు.

Story first published: Thursday, October 12, 2017, 13:09 [IST]
Other articles published on Oct 12, 2017
Please Wait while comments are loading...
POLLS