న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెట్‌ తరహా తప్పిదాలు చేయకండి.. చిన్న పొరపాటు ప్రభావం చూపుతుంది'

Rishabh Pant Urges Fans To Support Delhi Police, Follow Government Guidelines Amid Lockdown

ఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి ఢిల్లీలో అధికంగా ఉండటంతో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలని ప్రజలకు టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ విజ్ఞప్తి చేశాడు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పకుండా పాటించి కరోనా నివారణలో భాగం కావాలన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటుకు తావు ఇవ్వద్దన్నాడు. ఒక్క తప్పు కరోనా నివారణ కోసం జరుగుతున్న పోరాటాన్ని తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు.

తొలి చూపులోనే ఆమెను ప్రేమించా.. నా నిజజీవిత యువరాణి: శ్రీశాంత్‌తొలి చూపులోనే ఆమెను ప్రేమించా.. నా నిజజీవిత యువరాణి: శ్రీశాంత్‌

కరోనా వైరస్‌ పోరుపై క్రికెట్‌లో చేసే తప్పిదాలను రిషభ్‌ పంత్‌ ఉదహరించాడు. 'క్రికెట్‌లో క్యాచ్‌ను డ్రాప్‌ చేసినా, స్టంపింగ్‌ మిస్‌ చేసినా అది మ్యాచ్‌పై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి మ్యాచ్ ​దిశ మారిపోవచ్చు. అదేవిధంగా చిన్న పొరపాటు కూడా కరోనా వైరస్​పై జరుగుతున్న యుద్ధాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలా జరుగకుండా ఢిల్లీ పోలీసులకు సహకరిద్దాం. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశాలను పాటిద్దాం. ఇంట్లోనే ఉందాం. నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రండి. భౌతిక దూరం తప్పకపాటించండి. అందరం కలిసికట్టుగా పోరాడితేనే ఈ యుద్ధంలో విజయం సాధించగలం' అని పంత్ వీడియోలో పేర్కొన్నాడు.

ఢిల్లీలోని కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,081చేరగా.. 45 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మే 3 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కాగా, భారత్‌లో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,601కి చేరింది. కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని, 590 మంది మృతి చెందారని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 14,759 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు పేర్కొంది.

'యువ వికెట్ కీప‌ర్, బ్యాట్స్‌మ‌న్ రిషబ్ పంత్‌లో చాలా టాలెంట్ ఉంది. అత‌డు నా స్నేహితుడ‌ని నేను ఈ మాట‌లు చెప్ప‌డం లేదు. అయితే అతడిలో కాస్త ఆత్మవిశ్వాసం లోపించింది. ఏ రోజైతే అతడు పూర్తి విశ్వాసంతో ఆడతాడో ఆరోజు ప్రత్యర్థి జట్టు ప్రమాదంలో పడినట్టే. పొట్టి ఫార్మాట్‌లో పంత్ బాగా ఆడతాడు. తన షాట్ ఎంపికలో కొంత తడబాటుకు గురవుతున్నాడు. కొన్నిసార్లు పేలవమైన షాట్లు ఆడి పెవిలియన్ చేరాడు' అని మ‌హ్మ‌ద్ ష‌మీ చెప్పాడు. పంత్ ఇటువలి కాలంలో జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, April 21, 2020, 16:48 [IST]
Other articles published on Apr 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X