క్రెడిట్ మొత్తం ధోనిదే: టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడంపై పంత్

Rishabh Pant Reveals How MS Dhoni Helped His Career Grow

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడంపై వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, ఈ క్రెడిట్ మొత్తం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిదేనని చెప్పుకొచ్చాడు.

బీసీసీఐ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో రిషబ్ పంత్ మాట్లాడుతూ "కీపింగ్‌లో ధోని చాలా విషయాలు నుంచి నేర్చుకున్నా. వికెట్ కీపింగ్‌లో చేతులు, తలే ముఖ్యభూమిక పోషిస్తాయి. ఆ తర్వాత బాడీ బ్యాలెన్స్ అని ధోని సలహా ఇచ్చాడు. ముఖ్యంగా చేతులు, తల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. ధోని చెప్పిన విషయం ఎంతో ఉపయోగపడింది" అని అన్నాడు.

 టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడంపై

టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడంపై

"ఇక, టీమిండియా టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడం నిజంగా అద్భుతమైన ఫీలింగ్‌. టెస్టు జట్టులో చోటు దక్కిందనే వార్త వినగానే ఆశ్చర్యానికి లోనయ్యా. భారత టెస్టు జట్టులో చోటు సంపాదించడం అనేది నా కల. అది నెరవేరడంతో సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నా" అని రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ స్థాయిలో ఉన్నానంటే

ఈ స్థాయిలో ఉన్నానంటే

"నేనే కాదు.. నా కుటుంబం... నా కోచ్‌ అంతా డబుల్‌ హ్యాపీ. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు క్రికెట్‌ పాఠాలు నేర్పిన కోచ్‌ తారెక్‌ సిన్షా సర్‌ కారణం. నాకంటూ ప్రత్యేక గుర్తింపు రావడానికి ఆయనే కారణం. ఆయనెప్పుడూ నన్ను టెస్టు క్రికెటర్‌గా చూడాలని అనుకునే వారు. నాకు టెస్టు జట్టులోకి పిలుపు వచ్చిన వెంటనే నా కోచ్‌ గర్వంగా ఫీలయ్యారు" అని రిషబ్‌ పేర్కొన్నాడు.

రెండింటికీ పెద్ద తేడా ఉండదు

రెండింటికీ పెద్ద తేడా ఉండదు

ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున పంత్ అద్భుత చేసిన సంగతి తెలిసిందే. వైట్ బాల్‌తో అద్భుత ప్రదర్శన చేశారు కదా? మరి రెడ్ బాల్‌తో ఎలా ఆడబోతున్నారన్న ప్రశ్నకు గాను పంత్ తనదైన శైలిలో స్పందించాడు. "రెండింటికీ పెద్ద తేడా ఉండదు. షాట్‌ను ఎంపిక చేసుకునే విధానంలో ఉంటుంది. రెడ్ బాల్ క్రికెట్‌లో మైదానంలో ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ భిన్నంగా ఉంటాయి. కావాల్సినంత సమయం కూడా ఉంటుంది కాబట్టి, నెమ్మదిగా షాట్‌ను ఎంపిక చేసుకుని ఆడొచ్చు. అదే పరిమిత ఓవర్ల క్రికెట్ వస్తే బాల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి దూకుడుగా ఆడాల్సి ఉంటుంది" అని పంత్ తెలిపాడు.

 ఎంతో ఉత్సుకతతో ఉన్నా

ఎంతో ఉత్సుకతతో ఉన్నా

"రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నా. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టా. ఇంగ్లాండ్‌లో పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అయితే, ఇండియా-ఏ జట్టు తరుపున ఆడటంతో కొంత మేరకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చింది" అని రిషబ్ పంత్ తెలిపాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణంపై పంత్

ఇక, డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ వాతావరణంపై కూడా పంత్ స్పందించాడు. "డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎప్పుడు అడుగుపెట్టినా... పాజిటివ్ వాతావరణం ఉంటుంది. ఒకరికి మరొకరు మద్దతు పలుకుతారు. డ్రెస్సింగ్‌లో నెలకొన్న వాతావరణమే భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది" అని పంత్ అన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, July 24, 2018, 12:41 [IST]
Other articles published on Jul 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X