న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: 'No.4 స్పాట్‌లో పంత్ సక్సెస్ అవలేడు'

Rishabh Pant not able to succeed at No.4, should bat at 5 or 6: VVS Laxman

హైదరాబాద్: No. 4 స్ఫాట్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విజయవంతం కాలేడని భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. అయితే, అందుకు గల కారణాన్ని కూడా లక్ష్మణ్ వెల్లడించాడు. ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమవతున్నాడు.

తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ ప్రదర్శనపై లక్ష్మణ్ మాట్లాడుతూ "పంత్ బ్యాటింగ్ యొక్క స్వభావం ఏమిటంటే అతను దూకుడు షాట్లు ఆడటం. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు తరుపున అతడు సక్సెస్ అయ్యాడు. No. 4 స్ఫాట్‌లో బరిలోకి దిగే పంత్ యావరేజిని 45గా కలిగి ఉన్నాడు. కానీ, దురదృష్టవశాత్తు అంతర్జాతీయ స్థాయిలో అతను నాలుగో స్థానంలో విజయం సాధించలేకపోయాడు" అని అన్నారు.

డేవిడ్ మిల్లర్ సరికొత్త రికార్డు: కొట్టడమే కాదు.. పట్టడంలో కూడా ఘనుడేడేవిడ్ మిల్లర్ సరికొత్త రికార్డు: కొట్టడమే కాదు.. పట్టడంలో కూడా ఘనుడే

ప్రతి ఒక్క ఆటగాడికీ ఈ దశ వస్తోంది

ప్రతి ఒక్క ఆటగాడికీ ఈ దశ వస్తోంది

"ప్రతి ఒక్క ఆటగాడికీ తన కెరీర్‌లో ఈ దశ వస్తుంది. అతడి నేచురల్ గేమ్ ఫ్రీగా ఆడటమే, అయితే, ఇప్పుడు ఆ ఆటతో మంచి ఫలితాలను రాబట్టలేకపోతున్నాడు. స్టయిక్‌ను రొటేట్ చేయడం ద్వారా గత మ్యాచ్ తప్పిదాల నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఇన్నింగ్స్ ప్రారంభంలో పంత్ సరైన షాట్‌లను ఎంపిక చేసుకోలేకపోతున్నాడు" అని లక్ష్మణ్ అన్నారు.

పంత్ 5 లేదా 6 స్థానాల్లో

పంత్ 5 లేదా 6 స్థానాల్లో

"పంత్ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్ చేయాలి. ఆ స్థానాల్లో దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. అయితే, No. 4 స్ఫాట్‌లో పరుగులు రాబట్టేందుకు అతడికి సరైన పద్ధతి తెలియడం లేదు. No. 4 స్ఫాట్‌లో బ్యాటింగ్ చేసేందుకు గాను హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ వంటి క్రికెటర్లు ఉన్నారు. వారు ఇప్పటికే ఆ స్థానంలో ఆడేందుకు తగిన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు" అని లక్ష్మ్ తెలిపారు.

రిషబ్ పంత్ ప్రదర్శనపై

రిషబ్ పంత్ ప్రదర్శనపై

ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రిషబ్ పంత్ ప్రదర్శన అటు అభిమానులతో పాటు ఇటు జట్టు మేనేజ్‌మెంట్‌ను నిరాశపరుస్తోంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో రిషబ్ పంత్ రిషబ్ పంత్‌(19) నిరుత్సాహపరిచాడు. తనపై తీవ్ర విమర్శలు చేస్తోన్న వేళ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌

ఆదివారం నాటి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్‌ పేలవ షాట్‌తో మరోసారి పెవిలియన్‌కు చేరాడు. మూడో టీ20లో టాపార్డర్‌ విఫలకావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. దీంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకొని ఆడి ఉంటే టీమిండియా విజయాన్ని సాధించింది.

ఇంకా అనుభవం అవసరం!

ఇంకా అనుభవం అవసరం!

అయితే, ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌లో ఫార్చూన్‌ బౌలింగ్‌లో అవుట్‌సైడ్‌ ఆఫ్‌ బంతిని వెంటాడి మరి గాల్లోకి లేపడంతో ఆ సమయంలో అక్కడే పీల్డింగ్‌ చేస్తున్న ఫెలూక్వాయో ఈజీ క్యాచ్‌ అందుకోవడంతో పంత్‌ వెనుదిరిగాడు. ఇప్పటివరకు భారత్ తరుపున 11 టెస్టులు, 12 వన్డేలు, 19 టీ20లకు ప్రాతినిథ్యం వహించిన ఈ యువ వికెట్ కీపర్ మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయడంలో ఇంకా అనుభవం తెచ్చుకోవాలని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Story first published: Monday, September 23, 2019, 13:40 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X