న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్ ధోనిని దాటేస్తాడు!: గిల్‌క్రిస్ట్‌ను గుర్తుకు తెస్తున్నాడన్న రికీ పాంటింగ్

India vs Australia 4 Test : Pant Crosses Dhoni's Mark In Team India Says Ricky Ponting | Oneindia
 Rishabh Pant next MS Dhoni? Ricky Ponting compares babysitter to another legendary wicket-keeper

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని దాటేస్తాడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రిషబ్ పంత్ (159 నాటౌట్) అద్భుత సెంచరీతో సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

నెం.4 స్థానంలో రిషబ్ పంత్‌ని ఆడిస్తే: గేమ్ ఛేంజర్ అంటూ పంత్‌పై దాదానెం.4 స్థానంలో రిషబ్ పంత్‌ని ఆడిస్తే: గేమ్ ఛేంజర్ అంటూ పంత్‌పై దాదా

దీంతో రిషబ్ పంత్‌పై రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషభ్‌ పంత్‌లో అపారమైన నైపుణ్యం దాగుంది అని చెప్పడానికి సిడ్నీ టెస్టులో అతడు సాధించిన సెంచరీనే చక్కటి ఉదాహరణ అని కొనియాడాడు. ఈ సందర్భంగా పాంటింగ్ మాట్లాడుతూ "పంత్‌లో అద్భుతమైన ప్రతిభ దాగుంది. అంతేకాదు అతడు మంచి బాల్ స్ట్రైకర్" అని అన్నాడు.

ధోని గురించే ఇప్పటివరకూ మాట్లాడుకున్నాం

ధోని గురించే ఇప్పటివరకూ మాట్లాడుకున్నాం

"భారత్‌ క్రికెట్‌లో ధోని ప్రభావం గురించే మాత్రమే ఇప్పటివరకూ మాట్లాడుకున్నాం. ఇక నుంచి రిషభ్‌ పంత్‌ గురించి మాట్లాడుకుంటాం. ధోని ఎక్కువ కాలం టెస్టు క్రికెట్‌ ఆడినా ఈ ఫార్మాట్‌లో కేవలం ఆరు సెంచరీలు మాత్రమే సాధించాడు. అదే సమయంలో ఎన్నో ఘనతలు ధోని సొంతం. కానీ ఈ యువ వికెట్‌ కీపర్‌ కచ్చితంగా ధోనిని దాటేస్తాడు" అని పాంటింగ్ అన్నాడు.

బంతిని స్టైక్‌ చేసే విధానం

బంతిని స్టైక్‌ చేసే విధానం

"పరిస్థితులకు తగ్గట్టు ఆడే నైపుణ్యం రిషభ్‌ పంత్‌కు ఉంది. అతనిలో అసాధారణ ప్రతిభ దాగి ఉంది. బంతిని స్టైక్‌ చేసే విధానం చూడ ముచ్చటగా ఉంది. అతను బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ను గుర్తుకు తెస్తున్నాడు. ప్రస్తుతం 21 ఒడిలో ఉన్న రిషబ్ పంత్ సుదీర్ఘ కాలం భారత్‌ జట్టుకు సేవలందించడం ఖాయం" అని పాంటింగ్‌ అన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా

"రిషబ్ పంత్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నేను కోచ్‌గా ఉండటం ఎంతో అదృష్టవంతుడిని. వికెట్ కీపింగ్‌పై పంత్ మరింత దృష్టి సారిస్తే అతడికి తిరుగుండదు" అని పాంటింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌లో పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో రిష‌బ్ పంత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్

ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్

138 బంతుల్లోనే 8 ఫోర్ల‌ సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఆస్ట్రేలియాలో భార‌త్ వికెట్ కీప‌ర్‌లు ఎవ‌రూ టెస్ట్ సెంచ‌రీ సాధించ‌లేదు. తొలిసారి పంత్ ఆ ఘన‌త సాధించాడు. భారత్ తరుపున ఇప్పటివరకు తొమ్మిది టెస్టులాడిన రిషబ్ పంత్‌కు ఇది రెండో సెంచరీ.

జెఫ్రీ డుజాన్ త‌ర్వాత‌

జెఫ్రీ డుజాన్ త‌ర్వాత‌

గతేడాది ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఓవ‌ల్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో పంత్ 114 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు జెఫ్రీ డుజాన్ త‌ర్వాత‌ ఇంగ్లాండ్‌లోనూ, ఆస్ట్రేలియాలోనూ సెంచ‌రీలు చేసిన ప‌ర్యాట‌క జ‌ట్టు వికెట్ కీప‌ర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. దీంతో పాటు ఒక టెస్ట్ సిరీస్‌లో 200 కంటే ప‌రుగులు, 20 క్యాచ్‌లు అందుకున్న ఉప‌ఖండ‌పు తొలి వికెట్ కీప‌ర్‌గా రిషబ్ అరుదైన ఘనత సాధించాడు.

Story first published: Saturday, January 5, 2019, 16:38 [IST]
Other articles published on Jan 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X