న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్ పర్యటనలో ధోని రికార్డుని బద్దలు కొట్టిన రిషబ్ పంత్

Rishabh Pant moves past MS Dhonis record with his West Indies heroics

హైదరాబాద్: రిషబ్ పంత్... ప్రస్తుతం భారత జట్టులో రాణిస్తోన్న యువ వికెట్ కీపర్. గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్టు సిరిస్‌లో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ తనదైన శైలిలో దూకుడుని ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన ఆఖరి టెస్టులో సెంచరీతో చెలరేగాడు. అనంతరం వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తృటిలో సెంచరీలు చేజార్చుకున్నాడు.

రెండు టెస్టుల్లో 92 పరుగుల వద్ద ఔటైన రిషబ్ పంత్

రెండు టెస్టుల్లో 92 పరుగుల వద్ద ఔటైన రిషబ్ పంత్

అయితే, రెండు టెస్టుల్లో 92 పరుగుల వద్ద ఔటై ఓ అనవసర రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 92 పరుగుల వద్ద ఔటైన రిషబ్ పంత్, హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సైతం అదే 92 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు పంత్ చేశాడు.

రెండో భారత ఆటగాడిగా పంత్ రికార్డు

రెండో భారత ఆటగాడిగా పంత్ రికార్డు

అనవసర షాట్‌కు ప్రయత్నించి మిడ్‌ఆఫ్‌లో ఉన్న హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో వరుస ఇన్నింగ్స్‌ల్లో 90పైచిలుకు పరుగుల వద్ద ఔటైన రెండో భారత ఆటగాడిగా పంత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. 1997 శ్రీలంకపై రెండు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ద్రవిడ్ వరుసగా 92, 93 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ధోని రికార్డుని బద్దలు కొట్టిన రిషబ్ పంత్

ధోని రికార్డుని బద్దలు కొట్టిన రిషబ్ పంత్

అయితే, వెస్టిండిస్ సిరిస్‌తో రిషబ్ పంత్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌ కీపర్ బ్యాట్స్‌మన్‌‌ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టు ఫార్మాట్‌లో తన తొలి ఐదు మ్యాచుల్లో ధోని 297 పరుగులు చేశాడు. అయితే, పంత్ ఈ రికార్డుని పంత్ బద్దలు కొట్టాడు. పంత్ తన తొలి ఐదు టెస్టుల్లో 43.25 యావరేజితో 346 పరుగులు సాధించాడు.

తొలి ఐదు మ్యాచుల్లో ధోని అత్యధిక స్కోరు 51 నాటౌట్‌

తొలి ఐదు మ్యాచుల్లో ధోని అత్యధిక స్కోరు 51 నాటౌట్‌

కాగా, తొలి ఐదు మ్యాచుల్లో ధోని అత్యధిక స్కోరు 51 నాటౌట్‌ కావడం గమనార్హం. అదీ 2005లో శ్రీలంకపై ఈ పరుగులు సాధించాడు. 2014లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని తన కెరీర్‌లో 4,876 పరుగులు చేశాడు. టెస్టుల్లో ధోని అత్యధిక స్కోరు 224. ఈ ప్రదర్శనతో రిషబ్‌ పంత్‌ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Monday, October 15, 2018, 17:59 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X