న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20: ధోని రికార్డుపై కన్నేసిన రిషభ్ పంత్

Rishabh Pant looks to surpass MS Dhonis record in T20Is vs West Indies

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుపై కన్నేశాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టీ20 శుక్రవారం జరగనుంది.

ఈ మ్యాచ్‌లో టీ20ల్లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్ల జాబితాలో రిషబ్ పంత్.. ధోనీని అధిగమించనున్నాడు. భారత్ తరుపున ఇప్పటివరకు 7 టీ20లు ఆడిన రిషబ్ పంత్ 3 డిస్మిసల్స్ చేశాడు. అదే, ధోని విషయానికి వస్తే 7 టీ20లు ఆడి 5 డిస్మిసల్స్ చేశాడు.

Happy birthday Gabbar: 34వ పడిలోకి ధావన్, ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ వెల్లువHappy birthday Gabbar: 34వ పడిలోకి ధావన్, ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ వెల్లువ

ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ కీపర్ దినేష్ రామ్‌దిన్ 5 డిస్మిసల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతుండగా... మరో విండీస్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఆండ్రీ ఫ్లెచర్ 4 డిస్మిసల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 3 డిస్మిసల్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ధోని రికార్డుపై కన్నేసిన పంత్

ధోని రికార్డుపై కన్నేసిన పంత్

భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్‌గా ధోని రికార్డుని కలిగి ఉన్నప్పటికీ ఈ సిరిస్‌లో అతడు ఆడటం లేదు. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. తొలి టీ20 డిసెంబర్ 6న నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

తన ఆటతీరుతో విమర్శలు

తన ఆటతీరుతో విమర్శలు

ఇటీవలి కాలంలో రిషబ్ పంత్ తన ఆటతీరుతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ లేదా రివ్యూల విషయంలో పంత్ పూర్తిగా విఫలమవుతున్నాడు. బంగ్లాదేశ్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో అనవసరంగా కెప్టెన్ రోహిత్ శర్మను రివ్యూ తీసుకోమని చెప్పి నవ్వులు పాలయ్యాడు.

కెప్టెన్‌గా కీరన్ పొలార్డ్

కెప్టెన్‌గా కీరన్ పొలార్డ్

మరోవైపు, వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా కీరోన్ పొలార్డ్ నాయకత్వం వహించనున్నాడు. స్వదేశంలో జరిగిన ఓటమికి ఈ సిరిస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని వెస్టిండిస్ చూస్తోంది. కెప్టెన్‌గా పొలార్డ్‌కి ఇది రెండో సిరిస్ కాగా... అంతకముందు ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరిస్ మొదటిది కావడం విశేషం.

భారత్-విండిస్ టీ20ల్లో డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్లు వీరే

భారత్-విండిస్ టీ20ల్లో డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్లు వీరే

MS Dhoni - 5 in 7 matches, Catches - 3, Stumpings - 2

Dinesh Ramdin - 5 in 7 matches, Catches - 5, Stumpings - 0

Andre Fletcher- 3 in 4 matches, Catches - 3, Stumpings - 0

Dinesh Karthik - 3 in 4 matches, Catches - 3, Stumpings - 0

Rishabh Pant - 3 in 7 matches, Catches - 3, Stumpings - 0

Story first published: Thursday, December 5, 2019, 13:24 [IST]
Other articles published on Dec 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X