న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పోలికలు వద్దు: ప్రెజెంట్ సాహా.. పంత్ ఫ్యూచర్!!

'Pant Is Our Future,Saha Our Present,' Says India's Fielding Coach R Sridhar || Oeindia Telugu
Rishabh Pant Is Our Future, Wriddhiman Saha Our Present Says Fielding Coach R Sridhar


ఢిల్లీ: భారత వికెట్‌ కీపర్లు రిషబ్‌ పంత్‌, వృద్దిమాన్‌ సాహాను పోల్చడం సరికాదని టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అభిప్రాయపడ్డారు. వికెట్‌ కీపర్‌గా ప్రస్తుతం సాహా ఉన్నాడు. అయితే మా ఫ్యూచర్ మాత్రం పంతే అని ఆయన అన్నారు. మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనీకి సరైన ప్రత్యామ్నాయం అని భావించిన రిషభ్‌ పంత్‌ పూర్తిగా విఫలమయ్యాడు. నిర్లక్ష్యంగా ఆడటంతో పాటు ఒకే తరహాలో ఔట్‌ కావడంతో.. జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్మకం కోల్పోయింది.

షకిబుల్‌ హసన్‌పై చట్టపరమైన చర్యలు లేవు.. వివరణ మాత్రం ఇవ్వాలి: బీసీబీషకిబుల్‌ హసన్‌పై చట్టపరమైన చర్యలు లేవు.. వివరణ మాత్రం ఇవ్వాలి: బీసీబీ

ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో పంత్‌కు మరో అవకాశం ఇద్దాం అని సెలక్టర్లు అనుకున్నప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు విముఖత వ్యక్తం చేయడంతో సాహా జట్టులోకి వచ్చాడు. ఈ టెస్టు సిరీస్‌లో సాహా తాను ఏమిటో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ అవకాశం సరిగా రాకున్నా.. కీపర్‌గా అద్భుతాలు చేసాడు. దీంతో పంత్‌ కెరీర్‌ ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే పంత్‌ మా భవిష్యత్తు అని శ్రీధర్‌ అంటున్నారు.

తాజాగా శ్రీధర్‌ మాట్లాడుతూ... 'గాయంతో జట్టుకు దూరమై తిరిగి స్థానం దక్కించుకున్న సాహా అద్భుతంగా కీపింగ్‌ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఎన్నో క్లిష్టమైన క్యాచ్‌లను అందుకున్నాడు. సాహా గొప్ప వికెట్‌ కీపర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే సాహాను, పంత్‌ను పోల్చడం సరికాదు. వికెట్‌ కీపింగ్‌లో సాహా అనుభవజ్ఞుడు. పంత్‌ యువకుడు. ప్రస్తుతం సాహా.. భవిష్యత్‌లో పంత్‌. ఇద్దరూ గొప్ప వికెట్‌ కీపర్లే. విదేశీ పిచ్‌ల స్వభావాన్ని పంత్‌ తొందరగా అర్ధం చేసుకుంటున్నాడు. వెస్టిండీస్‌ పర్యటనే ఇందుకు ఉదాహరణ. భారత్‌-ఏ తరఫున విదేశీ పిచ్‌ల్లో ఆడిన అనుభవం పంత్‌కు ఉండటంతో అది అతనికి కలిసొచ్చింది' అని అన్నారు.

'గత కొన్నేళ్లుగా టీమిండియా ఫీల్డింగ్‌ అద్భుతంగా మెరుగైందని అనుకుంటున్నా. ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు భారత ఫీల్డింగ్‌ను పొగిడారు. రవిశాస్త్రి, కోహ్లీలు జట్టు టాప్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాడు నదీమ్‌ మైండ్‌సెట్‌, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాం. ఫిట్‌నెస్ ఎంతో కీలకం. మైదానంలో జడేజా ఉండటం జట్టుకు స్పూర్తినిస్తుంది. మెరుపు వేగంతో కదులుతూ, అద్భుత విన్యాసాలు చేస్తాడు. ఈ దశాబ్దంలో భారత్‌ అత్యుత్తమ ఫీల్డర్‌ జడేజానే. ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెడుతున్నాం. వచ్చే ఏడాది జరగునున్న టీ20 ప్రపంచకప్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం' అని శ్రీధర్‌ తెలిపారు.

Story first published: Monday, October 28, 2019, 16:57 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X