న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషబ్ పంత్‌పై తుది నిర్ణయం సెలక్టర్లదే: సౌరవ్ గంగూలీ

Rishabh Pant Had Special Talent, Let’s Leave Selection To Selectors, Says Sourav Ganguly
 Rishabh Pant is a special talent, lets leave selection to selectors, says Sourav Ganguly

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై తుది నిర్ణయం సెలక్టర్లదేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తోన్న రిషబ్ పంత్‌పై జట్టు మేనేజ్‌మెంట్ కొంత పాజిటివ్ దృక్పథంతో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే, పంత్ స్థానంలో మరో యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది సెలక్టర్లే కానీ తాను కాదని తాజాగా ఓ కార్యక్రమానానికి హాజరైన సౌరవ్ గంగూలీ అన్నాడు.

తొలి టీ20లో సాధ్యపడలా? కనీసం ఇండోర్‌లోనైనా!: ప్రపంచ రికార్డుకు పరుగు దూరంలో కోహ్లీతొలి టీ20లో సాధ్యపడలా? కనీసం ఇండోర్‌లోనైనా!: ప్రపంచ రికార్డుకు పరుగు దూరంలో కోహ్లీ

"పంత్‌ హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాట్స్‌మనే కాదు, ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న క్రికెటర్‌. అతని టెస్టు రికార్డు బాగుంది. అలానే కీలకమైన సమయంలో ధాటిగా ఆడే ఆటగాడు పంత్‌. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో పంత్‌ బాగా ఆడాడు. పంత్‌ను కొనసాగించాలా.. వద్దా అనేది సెలక్టర్లే చూసుకుంటారు. పంత్‌పై తుది నిర్ణయం సెలక్టర్లదే" అని గంగూలీ అన్నాడు.

ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ఆడుతోంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్‌-శ్రీలంక జట్లు రెండో మ్యాచ్‌పై దృష్టి పెట్టాయి. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు హోల్కర్ స్టేడియంలో రెండో టీ20 జరగనుంది.

'టీమిండియా పటిష్ఠమైన జట్టు.. గెలవాలంటే సీనియర్లు బాధ్యత తీసుకోవాలి''టీమిండియా పటిష్ఠమైన జట్టు.. గెలవాలంటే సీనియర్లు బాధ్యత తీసుకోవాలి'

ఈ మ్యాచ్‌ గెలిస్తే ఇక సిరీస్‌ కోల్పోయే అవకాశం ఉండదు కాబట్టి బోణీ కోసం ఇరు జట్లు సై అంటున్నాయి. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో పడ్డ ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.

తుది జట్లు (అంచనా)
భారత్‌: ధావన్, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, పంత్‌, శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌, బుమ్రా, నవ్‌దీప్‌ సైనీ.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, గుణతిలక, కుశాల్‌ పెరీర, ఒషాడ ఫెర్నాండో, రాజపక్స, ధనంజయ డిసిల్వ, షనక, ఉదాన, హసరంగ, లాహిరు కుమార, మలింగ (కెప్టెన్‌).

Story first published: Tuesday, January 7, 2020, 17:19 [IST]
Other articles published on Jan 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X