న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ఆదర్శంగా తీసుకునేది వారిద్దరినే, ధోనిని కాపీ కొట్టను: పంత్

Rishabh Pant Says I Don't Want To Copy MS Dhoni | Oneindia Telugu
Rishabh Pant: I dont want to copy MS Dhoni

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తాను కాపీ కొట్టనని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై శతకం నమోదు చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ రికార్డు సృష్టించడంతో పాటు నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో మొత్తం 350 పరుగులు చేశాడు.

<strong>'జట్టు బ్యాలెన్స్‌ కావడంలో పాండ్యా పాత్ర కీలకం' </strong>'జట్టు బ్యాలెన్స్‌ కావడంలో పాండ్యా పాత్ర కీలకం'

అంతేకాదు నాలుగు టెస్టుల్లో 20 క్యాచ్‌లు అందుకున్నాడు. టెస్టు సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి లభించిన నేపథ్యంలో ఖాళీ సమయాన్ని పంత్‌ ఆస్వాదిస్తున్నాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో తాను ఆదర్శంగా తీసుకునే వారిలో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్, ధోనిలు ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నాడు.

ధోనిని కాపీ కొట్టను

ధోనిని కాపీ కొట్టను

అలా అని వారిని తాను కాపీ కొట్టనని కూడా తెలిపాడు. తాను తనలా ఉంటూనే వారి నుంచి కొన్ని విషయాలను నేర్చుకుంటానని ఈ సందర్భంగా రిషబ్ పంత్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రిషభ్‌ పంత్‌-టిమ్‌ పైన్‌ల మధ్య సాగిన స్లెడ్జింగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.

సిరిస్‌కే హైలెట్‌గా నిలిచిన పంత్

సిరిస్‌కే హైలెట్‌గా నిలిచిన పంత్

ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మాటలకు ఏ మాత్రం తగ్గకుండా పంత్ కూడా ఘాటుగానే స్పందించి సిరిస్‌కే హైలెట్‌గా నిలిచాడు. ఆసీస్‌ క్రికెటర్లపై స్లెడ్జింగ్‌ చేయడాన్ని రిషభ్‌ పంత్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన స్లెడ్జింగ్‌ను కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్‌ చేసినట్లు రిషభ్‌ పంత్ చెప్పుకొచ్చాడు.

జట్టు కోసం ఏమి చేయాలో అది చేశా

జట్టు కోసం ఏమి చేయాలో అది చేశా

"నేను నా జట్టు కోసం ఏమి చేయాలో అది చేశా. నన్ను ఎవరైనా టార్గెట్‌ చేస్తే అంతే గట్టిగా బదులివ్వాలనుకున్నా. ఇక్కడ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నియమాన్ని కూడా మరిచిపోలేదు. నిబంధనలకు లోబడే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డా. నా స్లెడ్జింగ్‌ను అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇష్టపడ్డారు. ప్రధానంగా నా తల్లి, నా సోదరి సైతం నేను స్లెడ్జింగ్‌ చేసిన విధానాన్ని బాగా ఎంజాయ్‌ చేశారు" అని పంత్ చెప్పుకొచ్చాడు.

ప్రేమలో పడ్డ రిషబ్ పంత్

ఇదిలా ఉంటే, రిషభ్‌ పంత్‌ ప్రేమలో పడ్డాడు. బుధవారం ‘ఇన్‌స్టాగ్రామ్‌'లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశాడు. దీనిపై ‘నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వు...నిన్ను కూడా సంతోషంగా ఉంచడమే నేను చేయాల్సింది' అని క్యాప్షన్ ఇచ్చాడు.

Story first published: Thursday, January 17, 2019, 16:26 [IST]
Other articles published on Jan 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X