న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Delhi Capitals: అమిత్‌ మిశ్రా బలి.. హ్యాట్రిక్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డ రిషభ్‌ పంత్!!

Rishabh Pant hitting massive sixes in Amit MIshra bowling during Delhi Capitals training

దుబాయ్: టీమిండియా మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తాము ఆడిన రోజుల్లో షార్జాలో మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా గంగూలీ 1998లో కోకాకోలా కప్ ఫైనల్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్‌ గ్రాండ్ ఫ్లవర్‌ బౌలింగ్‌లో స్టేడియం బయటకు బంతులను బాదాడు. అనంతరం ఇప్పుడు టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ మళ్లీ భారీ షాట్లు ఆడాడు. అయితే పంత్ ఆడింది ప్రాక్టీస్‌ సెషన్‌లో. ఇక్కడ బలైంది టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్‌ మిశ్రా.

సీరియస్‌గా ప్రాక్టీస్‌

సీరియస్‌గా ప్రాక్టీస్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని ప్రాంఛైజీలు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా దాదాపు పది రోజులే ఉండడంతో అన్ని జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిషబ్ పంత్‌ సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఐపీఎల్‌తో తన టీమిండియా రీఎంట్రీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో పంత్‌ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను ప్రాక్టీస్‌ చేస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ.

హ్యాట్రిక్‌ సిక్సర్లు

హ్యాట్రిక్‌ సిక్సర్లు

షార్జాలోని ప్రాక్టీస్‌ సెషన్‌లో వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలి బంతిని లాంగాన్‌ సిక్స్‌ కొట్టిన పంత్‌.. రెండో బంతిని డీప్‌ ఫైన్‌లెగ్‌ మీదుగా సిక్స్‌ బాదేశాడు. ఇక మూడో బంతిని లాంగాఫ్‌ వైపు బౌండరీ దాటించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ షేర్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. వరుసగా మూడు సిక్సర్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆనందాన్ని పంత్ రెట్టింపు జేశాడు. ‍ఇక పంత్‌ కొట్టిన సిక్సర్లకు.. గంగూలీ వరుసగా కొట్టిన మూడు సిక్సర్లను ఒక అభిమాని జత చేశాడు.

పాంటింగ్‌ పర్యవేక్షణలో

పాంటింగ్‌ పర్యవేక్షణలో

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌ సౌరవ్‌ గంగూలీ అందుబాటులో లేకపోవడంతో.. హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ పర్యవేక్షణలో ఢిల్లీ ప్రాక్టీస్‌ ముమ‍్మరం చేసింది. ఇటీవలే ప్రాక్టీస్‌ కోసం లెక్కకు మించి శ్రమించాల్సిన అవసరం లేదని క్యాపిటల్స్‌ బృందానికి పాంటింగ్ తెలియజేశాడు. ఒకవేళ ఇప్పుడు విరామం​ లేకుండా ప్రాక్టీస్‌ చేస్తే ఆ సమయానికి అలసిపోతామని అతడు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ డైలీ ప్రాక్టీస్‌ను గంటలకే పరిమితం చేసింది.

ఈసారి కూడా రెచ్చిపోవాలని

రిషబ్ పంత్ 2018 ఐపీఎల్ సీజన్లో 684 పరుగులు చేశాడు. ఇక 2019లో 488 రన్స్ చేసి.. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ప్లే-ఆఫ్స్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఈసారి కూడా రెచ్చిపోవాలని చూస్తున్నాడు. శిఖర్ ధావన్, రిషబ్ పంత్ఎం శ్రేయాస్ అయ్యర్, అంజిక్య రహానే, షిమ్రాన్ హెట్మయిర్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీలతో ఢీల్లీకి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆర్ అశ్విన్, సందీప్ లామిచనే, అమిత్ మిశ్రా, ఆక్సర్ పటేల్ వంటి స్పిన్ విభాగం కూడా ఉంది.

Story first published: Tuesday, September 8, 2020, 16:22 [IST]
Other articles published on Sep 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X