న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rishabh Pant : యాక్సిడెంట్ తర్వాత పంత్ తొలి ట్వీట్.. ఏమన్నాడంటే?

Rishabh Pant first tweet after accident goes viral. He thanks everyone who wished him.

భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత టీమిండియా స్టార్ రిషభ్ పంత్ తొలిసారి అభిమానులను పలకరించాడు. సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చాడు.

అలాగే ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అతను చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పంత్ నుంచి నేరుగా అప్‌డేట్ రావడంతో అభిమానులు సంతోషించారు. అతను త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.

మోకాళ్లకు ఆపరేషన్లు..

మోకాళ్లకు ఆపరేషన్లు..

కొత్త సంవత్సరానికి ముందు రూర్కీ సమీపంలో పంత్ వెళ్తున్న కారుకు భయంకరమైన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌కు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత శస్త్రచికిత్స అవసరం ఉండటంతో అతన్ని ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే అతనికి పలు ఆపరేషన్లు జరిగాయి. ముఖ్యంగా అతని మోకాళ్లకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.

తొలిసారి స్పందించిన పంత్..

తొలిసారి స్పందించిన పంత్..

ఈ క్రమంలో ప్రమాదం తరువాత తొలిసారి సోషల్ మీడియాలో స్పందించిన పంత్.. తను కోలుకుంటున్నట్లు చెప్పాడు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అతను ఇంత త్వరగా కోలుకోవడంలో ప్రభుత్వం, బీసీసీఐ కీలక పాత్ర పోషించాయి. అతనికి కావలసిన అన్ని రకాల సేవలు నిమిషాల్లో అందేలా చర్యలు తీసుకున్నాయి. అయితే అతను కోలుకోవడానికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను కీలకం అనుకుంటే.. ఇప్పుడు ఆ సిరీస్‌కు పంత్ దూరమయ్యాడు. వచ్చే ఐపీఎల్‌లో కూడా పంత్ ఆడటం లేదని గంగూలీ ధ్రువీకరించాడు.

పంత్ ఏమన్నాడంటే?

పంత్ ఏమన్నాడంటే?

'మీ అందరి మద్దతు, విషెస్ చూసి చాలా సంతోషిస్తున్నా. నాకు ఇంత ప్రేమ పంచినందుకు ధన్యవాదాలు. నా శస్త్రచికిత్స విజయంవంతంగా ముగిసిందని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నా. రికవరీ ప్రయాణం మొదలుపెట్టా. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం' అని ట్వీట్ చేశాడు పంత్. అలాగే తనకు సాయం చేసిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అతను ఈ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే దీనికి 10 వేల పైగా లైకులు వచ్చాయి. అభిమానులంతా పంత్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Tuesday, January 17, 2023, 8:08 [IST]
Other articles published on Jan 17, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X