న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి పొట్టి ఫార్మాట్‌లో విఫలమైన పంత్.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్

Rishabh Pant fails in his return against Zimbabwe trolled online

ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా అద్భుతంగా ఆడుతూ సెమీస్ చేరుకుంది. మెగా టోర్నీ ఆరంభానికి ముందు వార్మప్ మ్యాచుల్లో ఆటగాళ్లందరికీ అవకాశం కల్పించిన టీమ్ మేనేజ్‌మెంట్.. టోర్నీ ప్రారంభమయ్యాక ఒకే జట్టును కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను పక్కన పెడుతూనే వచ్చింది. మధ్యలో ఒక మ్యాచ్‌లో దీపక్ హుడా కూడా ఆడాడు. కానీ పంత్‌కు మాత్రం ఛాన్స్ దక్కలేదు.

పొట్టి ఫార్మాట్‌లో వరుస వైఫల్యాలు

టీ20 ఫార్మాట్‌లో రిషభ్ పంత్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కెరీర్‌లై 50పైగా టీ20 మ్యాచులు ఆడిన అతను ఏమాత్రం ఇటీవలి కాలంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. టెస్టు, వన్డేల్లో రాణిస్తున్న అతను.. టీ20ల్లో మాత్రం జట్టుకు భారంగా మారాడు. అలాంటి సమయంలోనే ఫినిషర్‌ పాత్రను అద్భుతంగా పోషిస్తూ దినేష్ కార్తీక్ దూసుకొచ్చాడు. దీంతో వీళ్లిద్దరిలో ఒకరికే అవకాశం ఇవ్వాలని జట్టు అనుకుంది. ప్రపంచకప్ ముందు కొన్ని ప్రయోగాలు చేసినా.. టోర్నీలో మాత్రం డీకే వైపే మొగ్గు చూపింది.

ఒక్క మ్యాచ్‌లో కూడా దక్కని అవకాశం

ప్రపంచకప్‌లో డీకేను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించడంతో రిషభ్ పంత్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. డీకేకు ఆసీస్ పిచ్‌లు అలవాటు అవ్వాలనే ఆలోచనతో వార్మప్ మ్యాచుల్లో కూడా అతనికే జట్టులో చోటు కల్పించారు. దీంతో పంత్‌కు ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. అంతకుముందు ఆసీస్ గడ్డపై టెస్టుల్లో పంత్ అద్భుతంగా రాణించాడు. దీంతో అతనికి ఒక్క అవకాశం వచ్చినా తన సత్తా నిరూపించుకుంటాడని అభిమానులు డిమాండ్లు చేశారు.

పునరాగమనంలోనూ విఫలం..

ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆడే అవకాశం పంత్‌కు దక్కలేదని భావించిన టీమిండియా సారధి రోహిత్ శర్మ బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో దినేష్ కార్తీక్‌ను పక్కనపెట్టి పంత్‌కు ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఈ అవకాశాన్ని కూడా పంత్ ఉపయోగించుకోలేదు. ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరిన పంత్

కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్ మూడు సింగిల్స్ తీశాడు. ఆ తర్వాత షాన్ విలియమ్స్ బౌలింగ్‌లో బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే లాంగాన్ వైపు స్లాగ్ స్వీప్ ఆడాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి ఎంసీజీ (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్)లోని భారీ బౌండరీని దాటలేకపోయింది. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ర్యాన్ బర్ల్ వేగంగా పరిగెత్తుకొచ్చి గాల్లోకి ఎగిరి మరీ అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు. దీంతో రిషభ్ పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

Story first published: Sunday, November 6, 2022, 17:58 [IST]
Other articles published on Nov 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X