న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో ధోని రికార్డుని బద్దలు కొట్టిన రిషబ్ పంత్

IND V WI 2019,3rd T20I: Rishabh Pant Breaks MS Dhoni's India Record during Guyana T20I
Rishabh Pant breaks MS Dhonis India record during Guyana T20I heroics

హైదరాబాద్: గుయానా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ 4 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

<strong>సుష్మాస్వరాజ్‌ మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా: కోహ్లీ</strong>సుష్మాస్వరాజ్‌ మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా: కోహ్లీ

ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుని బద్దలు కొట్టాడు. 2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 56 పరుగులు చేశాడు.

ఇప్పుడు ధోని రికార్డుని రిషబ్ పంత్ అధిగమించాడు. ఇక, సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ధోని చేసిన 52 పరుగులు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉంది.

వెస్టిండిస్ పర్యటనకు దూరమైన ధోని

వెస్టిండిస్ పర్యటనకు దూరమైన ధోని

భారత ఆర్మీకి రెండు నెలలు పాటు సేవలందించేందుకు గాను ధోని తనకు తానుగా వెస్టిండిస్ పర్యటనకు దూరం కావడంతో అతడి స్థానంలో మూడు ఫార్మాట్లలోనూ రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

3-0తో సిరిస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా

3-0తో సిరిస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా

వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. యువ పేసర్ దీపక్‌ చాహర్‌ (3/4) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 146/6 కు పరిమితమైంది.

147 పరుగుల లక్ష్య చేధనలో.

147 పరుగుల లక్ష్య చేధనలో.

అనంతరం 147 పరుగుల లక్ష్య చేధనలో.. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్‌ (3) మళ్లీ నిరాశ పరిచాడు. విండీస్ పేసర్ థామస్‌ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ ఆఖరి బంతికి షాట్‌ ఆడే క్రమంలో కాట్రెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (20; 18బంతుల్లో 2×4, 1×6) పర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో అలెన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు.

ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్‌కే ప్రాధాన్యం.. రవిశాస్త్రి కొనసాగింపు?

కోహ్లీతో కలిసి పంత్ సుడిగాలి ఇన్నింగ్స్

కోహ్లీతో కలిసి పంత్ సుడిగాలి ఇన్నింగ్స్

అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఇక క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 16వ ఓవర్‌లో కోహ్లీ.. 17వ ఓవర్‌లో పంత్‌ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. అయితే థామస్‌ బౌలింగ్లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.

మరోసారి విరుద్ధ ప్రయోజనాల సెగ.. ద్రవిడ్‌కు అంబుడ్స్‌మన్‌ నోటీసులు

థామస్‌ బౌలింగ్లోనే పంత్ సిక్స్

థామస్‌ బౌలింగ్లోనే పంత్ సిక్స్

కోహ్లీ నిష్క్రమణ అనంతరం థామస్‌ బౌలింగ్లోనే పంత్ సిక్స్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేసాడు. కాట్రెల్‌ వేసిన 19వ ఓవర్లో మనీష్ పాండే (2) తడబడంతో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. ఇక బ్రాత్‌వైట్‌ వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతికే పంత్ సిక్సర్‌ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచుల్లో విఫలమయిన పంత్.. ఈ మ్యాచులో ఆకట్టుకున్నాడు.

Story first published: Wednesday, August 7, 2019, 16:26 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X