న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గార్డ్ మార్చుకుని గేల్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్లు బాదిన వార్నర్ (వీడియో)

Right Handed Warner Slams Gayle for 14 in 3 Balls

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌తో ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌)లో ఆడుతున్నాడు. బీపీఎల్‌లో సిల్హెట్‌ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా వ్యహరిస్తున్న వార్నర్‌ మరోసారి తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

'అతడి ఆట అద్భుతం... సందర్భాన్ని బట్టి ఎలా ఆడాలో ధోనికి తెలుసు''అతడి ఆట అద్భుతం... సందర్భాన్ని బట్టి ఎలా ఆడాలో ధోనికి తెలుసు'

రంగాపూర్‌ రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఇందులో కొన్ని బంతులు ఆడటానికి ఇబ్బంది పడిన డేవిడ్ వార్నర్ తన బ్యాటింగ్‌ గార్డ్‌ను మార‍్చుకుని మరీ సిక్సులు బాదడం విశేషం.

గేల్‌ వేసిన 19 ఓవర్‌‌లో

గేల్‌ వేసిన 19 ఓవర్‌‌లో

స్వతహాగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన వార్నర్‌.... గేల్‌ వేసిన 19 ఓవర్‌ నాలుగో బంతికి ఉన్నపళంగా గార్డ్‌ మార్చుకున్నాడు. అంతకుముందు బాల్‌ను హిట్‌ చేద్దామని ప్రయత్నించిన వార్నర్‌ విఫలం కావడంతో కుడి చేతి వాటం బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఫీల్డ్‌ అంపైర్‌కు తెలిపిన వార్నర్‌

ఈ మేరకు ఫీల్డ్‌ అంపైర్‌కు తెలిపిన వార్నర్‌.. రైట్‌ హ్యాండ్‌తో ఆడిన మొదటి బంతిని సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత వరుస రెండు బంతుల్ని రెండు ఫోర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 47 పరుగుల్ని లెఫ్ట్‌ హ్యాండర్‌గా సాధించగా, 3 బంతుల్లో 14 పరుగుల్ని రైట్‌ హ్యాండర్‌గా వార్నర్ సాధించడం విశేషం.

70 పరుగులు చేసిన లిటన్ దాస్

70 పరుగులు చేసిన లిటన్ దాస్

ఈ మ్యాచ్‌లో వార‍్నర్‌కు తోడు లిటన్‌ దాస్‌ 43 బంతుల్లో 9ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 70 పరుగులు చేయడంతో సిల్హెట్‌ సిక్సర్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రంగపూర్‌ రైడర్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి ఓడిపోయింది.

Story first published: Thursday, January 17, 2019, 12:19 [IST]
Other articles published on Jan 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X