న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్ పట్టిన లారా, పాంటింగ్‌.. భారీ షాట్లతో అలరించిన దిగ్గజాలు (వీడియో)

Ricky Ponting wants to share crease with Brian Lara in the Bushfire charity match


సిడ్నీ
: ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తలపెట్టిన ఛారిటీ మ్యాచ్‌ పోస్ట్‌పోన్‌ అయింది. కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిర్వహించనున్న 'బుష్‌ఫైర్‌ క్రికెట్‌ బాష్‌' చారిటీ మ్యాచ్‌ శనివారానికి బదులు ఆదివారానికి పోస్ట్‌పోన్‌ అయింది. ఇక సిడ్నీలో జరగాల్సిన మ్యాచ్‌ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మెల్‌బోర్న్‌కు మారింది. సిడ్నీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో.. శనివారం నిర్వహించాల్సిన మ్యాచ్‌ను ఆదివారం జంక్షన్‌ ఓవల్‌ స్టేడియానికి సీఏ మార్చింది.

కరోనా వైరస్‌తో ముప్పేమీ లేదు.. షెడ్యూల్‌ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్‌!!కరోనా వైరస్‌తో ముప్పేమీ లేదు.. షెడ్యూల్‌ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్‌!!

షేన్‌ వార్న్‌ దూరం:

షేన్‌ వార్న్‌ దూరం:

'బుష్‌ఫైర్‌ క్రికెట్‌ బాష్‌' చారిటీ మ్యాచ్‌లో తలపడనున్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ లెవెన్‌కు భారత లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కోచ్‌గా వ్యవహరించనుండగా.. మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ లెవెన్‌ జట్టుకు వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ కోట్నీ వాల్ష్‌ కోచ్‌గా ఉన్నారు. అయితే మ్యాచ్‌ షెడ్యూల్‌ మార్చడంతో.. స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ దూరం కావాల్సి వచ్చింది. దీంతో జట్టు బాధ్యతలను గిల్‌క్రిస్ట్‌ అందుకోన్నాడు.

నెట్స్‌లో ప్రాక్టీస్‌:

నెట్స్‌లో ప్రాక్టీస్‌:

ఈ మ్యాచ్‌ కోసం రికీ పాంటింగ్‌ గురువారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసాడు. మరోవైపు బ్రయన్‌ లారా కూడా సాధన చేశాడు. ఇద్దరు దిగ్గజాలు నెట్స్‌లో భారీ షాట్లు ఆడారు. తమదైన షాట్లతో పాంటింగ్‌, లారా అలరించారు. ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోను పాంటింగ్‌ ట్విటర్‌లో పోస్టు చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.

 లారాతో కలిసి బ్యాటింగ్‌ చేయాలనుంది:

లారాతో కలిసి బ్యాటింగ్‌ చేయాలనుంది:

లారాతో కలిసి బ్యాటింగ్‌ చేయాలనుంది అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. ఆదివారం జరిగే ఛారిటీ మ్యాచ్‌లో ఒకవేళ నేను మూడో స్థానంలో ఆడితే.. లారా నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఉందన్నాడు. పాంటింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 27,486 పరుగులు చేశాడు. 2003, 2007లో కెప్టెన్‌గా రెండు వన్డే ప్రపంచకప్‌లు అందించాడు. మరోవైపు లారా విండీస్‌ తరఫున ఒక టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు (400) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఒక ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది:

ఒక ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది:

10 ఓవర్ల మ్యాచ్‌లో తలపడే రెండు జట్లు వివరాలను సీఏ వెల్లడించింది. వార్న్‌ దూరం కావడంతో గిల్‌క్రిస్ట్‌ లెవెన్‌లో ఇంకా ఒక ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, షేన్‌ వాట్సన్‌, యువరాజ్‌ సింగ్‌, ఆండ్రూ సైమండ్స్‌ ఒకే జట్టులో ఆడనున్నారు. రికీ పాంటింగ్‌, మాథ్యూ హెడెన్‌, జస్టిన్‌ లాంగర్‌, బ్రియాన్‌ లారా, వసీం అక్రమ్‌, బ్రెట్‌ లీలు మరో జట్టులో ఆడనున్నారు.

జట్లు:

జట్లు:

రికీ పాంటింగ్‌ లెవెన్‌: రికీ పాంటింగ్‌ (కెప్టెన్‌), మాథ్యూ హెడెన్‌, జస్టిన్‌ లాంగర్‌, ఎలీస్‌ విలానీ, బ్రియాన్‌ లారా, పోబీ లిచ్‌ఫీల్డ్‌, బ్రాడ్‌ హాడిన్‌ (వికెట్‌ కీపర్‌), బ్రెట్‌ లీ, వసీం అక్రమ్‌, డాన్‌ క్రిస్టియన్‌, లూక్‌ హాడ్జ్‌.

గిల్‌క్రిస్ట్‌ లెవెన్‌: ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), షేన్‌ వాట్సన్‌, బ్రాడ్‌ హాడ్జ్‌, యువరాజ్‌ సింగ్‌, అలెక్స్‌ బ్లాక్‌వెల్‌, ఆండ్రూ సైమండ్స్‌, నిక్‌ రివోడ్ట్‌, పీటర్‌ సిడిల్‌, ఫవాద్‌ అహ్మద్‌, టిమ్‌ పెయిన్‌.

Story first published: Friday, February 7, 2020, 10:45 [IST]
Other articles published on Feb 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X