న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

25వ క్రికెటర్‌గా హోదా: బాక్సింగ్ డే టెస్టులో పాంటింగ్‌కు అరుదైన గౌరవం

Ricky Ponting formally inducted into the ICC Cricket Hall of Fame

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది జులైలో డబ్లిన్ వేదికగా జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, ఇంగ్లాండ్ మాజీ మహిళా వికెట్ కీపర్ క్లారీ టేలర్‌లతో పాటు రికీ పాంటింగ్‌ కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

బాక్సింగ్ డే టెస్టులో 66 బంతుల్లో 8: హనుమ విహారి ఖాతాలో చెత్త రికార్డుబాక్సింగ్ డే టెస్టులో 66 బంతుల్లో 8: హనుమ విహారి ఖాతాలో చెత్త రికార్డు

అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పటివరకు రికీ పాంటింగ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ అవార్డుని అందుకోలేకపోయాడు. బుధవారం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో మరో మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ చేతుల మీదుగా పాంటింగ్ ఈ జ్ఞాపికను అందుకున్నాడు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి పాంటింగ్

ఇందుకు సంబంధించిన ఫోటోని ఐసీసీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ "ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఈ అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈరోజు 25 మంది ఆస్ట్రేలియన్లలో నేను ఒకడిని అయినందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు.

ఎలైట్ జాబితాలోకి చేరడం సంతోషంగా ఉంది

ఎలైట్ జాబితాలోకి చేరడం సంతోషంగా ఉంది

"ఆస్ట్రేలియా తరుపున ఒక టెస్టు మ్యాచ్ ఆడితేనే, ఎలైట్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కుతుంది. అలాంటిది ఐసీసీ హాల్ ఆఫ్ పేమ్‌ హోదా దక్కడం మరింత మంది క్రికెటర్ల ఎలైట్ జాబితాలో చోటు దక్కడమే. ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు" అని మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు.

గ్లెన్‌తో ఎన్నో మధురక్షణాలు

గ్లెన్‌తో ఎన్నో మధురక్షణాలు

"గ్లెన్ మెక్‌గ్రాత్‌తో నాకు ఎన్నో మధురక్షణాలు ఉన్నాయి. 1990ల్లో గ్లెన్‌తోనే నేను క్రికెట్ అకాడమీకి వెళ్లా. నాకు సుదీర్ఘ కాలం నుంచి గ్లెన్ తెలుసు. నా సహచర క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్ అందుకోవడం అతడే నాకు ఈ హోదాను కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది. గ్లెన్‌తో సుమారు 10 లేదా 12 ఏళ్లు కలిసి ఆడా" అని పాంటింగ్ అన్నాడు.

ఐసీసీ వల్లే ఇదంతా సాధ్యం

ఐసీసీ వల్లే ఇదంతా సాధ్యం

"ఇదొక గొప్ప గుర్తింపు. ఐసీసీ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎంసీజీలో 75,000 మంది ప్రేక్షకుల మధ్య ఈ గౌరవం పొందడం మరింత గర్వంగా ఉంది" అని రికీ పాంటింగ్ అన్నాడు. ఐసీసీ హాల్ ఆప్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 25వ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా పాంటింగ్ గుర్తింపు పొందాడు.

2012లో క్రికెట్‌కు వీడ్కోలు

2012లో క్రికెట్‌కు వీడ్కోలు

44 ఏళ్ల రికీ పాంటింగ్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా తరుపున 168 టెస్టు మ్యాచ్‌లాడిన పాంటింగ్ 13,378 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు ఉన్నాయి. ఇక, 375 వన్డేల్లో 30 సెంచరీలు... 17 టీ20ల్లో 401 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2006, 2007లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్న పాంటింగ్, 2006లో టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని దక్కించుకున్నాడు.

Story first published: Wednesday, December 26, 2018, 20:29 [IST]
Other articles published on Dec 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X