న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేతి వేలికి గాయం: చివరి రెండు టెస్టులకు బెయిర్ స్టో దూరమే!

By Nageshwara Rao
Reports: Jonny Bairstow likely to miss the last two Tests against India

లండన్: భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో దూరం కానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజైన సోమవారం పేసర్ ఆండర్సన్ వేసిన ఓవర్‌లో బెయిర్‌స్టో ఎడమ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అతనికి ఎక్స్‌రే తీసిన వైద్యులు అతనికి చిన్న ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారించారు. దీంతో భారత్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు బెయిర్ స్టో దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంగ్లాండ్ బోర్టు అధికారిక ప్రకటన చేయనుంది.

జానీ బెయిర్ స్టో స్థానంలో చివరి రెండు టెస్టులకు ఇయాన్ పేరుని సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో బెయిర్ స్టో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు బెయిర్ స్టో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 206 పరుగులు నమోదు చేశాడు.

1
42376

గాయం కారణంగా బెయిర్ స్టో చివరి రెండు టెస్టులకు దూరమవ్వడం ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు. కాగా, మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 352 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 521 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

నాలుగో రోజైన మంగళవారం ఓవర్‌నైట్‌ స్కోరు 23/0తో బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్ లంచ్ విరామ సమయానికి 84/4తో నిలిచింది. భారత పేసర్ల దెబ్బకు ఇంగ్లాండ్ టాపార్డర్ కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంగ్లండ్ ఇంకా 437 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్‌కు మరో ఆరు వికెట్లు కావాలి.

Story first published: Tuesday, August 21, 2018, 18:50 [IST]
Other articles published on Aug 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X