న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు ఎదురుదెబ్బ: విండిస్‌తో టీ20 సిరిస్‌కు ధావన్ దూరం, సంజూకే ఛాన్స్!

India vs West Indies 2019 : Sanju Samson To Replace Injured Shikhar Dhawan For West Indies T20Is
Reports: Injury rules Shikhar Dhawan out of West Indies T20Is, Sanju Samson to be likely replacement

హైదరాబాద్: వెస్టిండిస్‌తో పరిమిత ఓవర్ల సిరిస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా వెస్టిండిస్‌తో డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు ధావన్ దూరమైనట్లు స్పోర్ట్స్ స్టార్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. సయ్యద్ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే.

క్రీజును చేరుకునే సమయంలో డైవ్‌ చేయడంతో శిఖర్ ధావన్ కాలుకి కట్టె ముక్క కోసుకుంది. దీంతో ధావన్ మోకాలికి 20 కుట్లు పడ్డాయి. నాలుగు, ఐదు రోజుల్లో శిఖర్ ధావన్ కోలుకుంటాడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. అయితే, పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఆ ఫీలింగే వేరన్న దాదా: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ని తలపించిన డే నైట్ టెస్ట్ మ్యాచ్!ఆ ఫీలింగే వేరన్న దాదా: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ని తలపించిన డే నైట్ టెస్ట్ మ్యాచ్!

కాగా, ధావన్ స్థానంలో కేరళ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌కు సంజూ శాంసన్ ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడదు. ఫలితంగా సిరిస్ మొత్తం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

రిజర్వ్ బెంచ్‌‌కే పరిమితమైన సంజూ శాంసన్

రిజర్వ్ బెంచ్‌‌కే పరిమితమైన సంజూ శాంసన్

సంజూ శాంసన్‌ను ఎంపిక చేసి రిజర్వ్ బెంచ్‌‌కే పరిమిత చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం మండిపడ్డారు. భజ్జీ అయితే ఏకంగా ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీని మార్చాలంటూ డిమాండ్‌ చేశాడు. విండిస్ పర్యటనకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌ ట్విట్టర్‌లో తప్పుబట్టాడు.

నిరాశకు గురి చేసిందన్న ఎంపీ శశిథరూర్

"అవకాశం ఇవ్వకుండా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. మూడు టీ20ల సిరిస్‌లో డ్రింక్స్‌ ఇవ్వడం వరకే పరిమితం చేశారు. తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా విస్మరించారు. అతడి బ్యాటింగ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా లేక అతని హృదయాన్నా?" అని ట్వీట్ చేశాడు.

శశిథరూర్ ట్వీట్‌పై స్పందించిన భజ్జీ

శశిథరూర్ ట్వీట్‌పై స్పందించిన భజ్జీ "నేను అనుకోవడం శాంసన్‌ హృదయాన్ని టెస్టు చేయాలనే అనుకుంటున్నారు. సెలక్షన్‌ ప్యానల్‌ను మార్చాలి. పటిష్టమైన సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. దాదా అందుకు చర్యలు తీసుకుంటాడనే ఆశిస్తున్నా" అని ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చాడు.

జట్ల వివరాలు

వన్డే జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌

టీ20 జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌.

భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన వివరాలు:

భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన వివరాలు:

మూడు టీ20లు:

తొలి టీ20 - డిసెంబర్‌ 6, శుక్రవారం (ముంబై)

రెండో టీ20 - డిసెంబర్‌ 8, ఆదివారం (తిరువనంతపురం)

మూడో టీ20- డిసెంబర్‌ 11, బుధవారం (హైదరాబాద్‌)

మూడు వన్డేలు:

తొలి వన్డే - డిసెంబర్‌ 15, ఆదివారం (చెన్నై)

రెండో వన్డే - డిసెంబర్‌ 18, బుధవారం (విశాఖపట్నం)

మూడో వన్డే - డిసెంబర్‌ 22, ఆదివారం (కటక్‌).

Story first published: Wednesday, November 27, 2019, 9:27 [IST]
Other articles published on Nov 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X