న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఆర్‌సీబీలోకి వరల్డ్ నెంబర్ 2 బౌలర్ వానిందు హసరంగ!

RCB Picks Wanindu Hasaranga As Replacement Of Adam Zampa For IPL 2021

న్యూఢిల్లీ: భారత్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో దుమ్మురేపిన శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అన్ని కుదిరితే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లోనే బరిలోకి దిగనున్నాడు. వానిందు హసరంగాను తీసుకునేందుకు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టులోని ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కరోనా భయంతో లీగ్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో అతని ప్లేస్‌ను ఆల్‌రౌండర్ అయిన హసరంగాతో భర్తీ చేయాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హసరంగాను ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ సంప్రదించిందని, శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి నిరభ్యంతకర పత్రం(ఎన్‌ఓసీ) లభిస్తే అతను బరిలోకి దిగడం ఖాయామని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో హసరంగా భారత్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చివరి టీ20లో (4/9) 4 వికెట్లతో గబ్బర్ సేనను ఉక్కిరి బిక్కిరి చేశాడు. తన బర్త్ డే రోజే సూపర్ పెర్ఫామెన్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. తొలి టీ20 రెండు, రెండో టీ20లో ఓ వికెట్‌తో మొత్తం ఏడు వికెట్లు తీశాడు. ఇక వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఫస్ట్ వన్డేలో విఫలమైనప్పటికీ.. రెండో వన్డేలో(3/37) మూడు, మూడో వన్డేలో (2/28) రెండు వికెట్లు తీశాడు.

యూఏఈ పిచ్‌లు సైతం స్పిన్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్ కోసం పలు ఐపీఎల్ ప్రాంచైజీలు పోటీపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ సీజన్‌లో కుదరకపోయినా.. ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే సీజన్‌ కోసం జరిగే మెగా ఆక్షన్‌లో హసరంగాకు భారీ ధర పలుకుతుందని మాజీ క్రికెటర్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఈ యువ ఆటగాడికి మంచి ఐపీఎల్ భవిష్యత్తు ఉందని కొనియాడాడు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ 2-1తో కోల్పోయిన శ్రీలంక టీ20 సిరీస్‌ను మాత్రం 1-2తో గెలుచుకుంది.

Story first published: Friday, July 30, 2021, 18:59 [IST]
Other articles published on Jul 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X