న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ పర్యటనకు రాయుడును తీసుకోనున్న సెలక్టర్లు..?

Rayudu looks certain to bag berth for England tour

హైదరాబాద్: అంబటి రాయుడు భారత జట్టుకు దూరమై చాలా కాలమే అయింది. కానీ ప్రస్తుత ఐపీఎల్‌లో విశేషంగా రాణిస్తున్న అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో వన్డేలు, టీ20 సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ అతణ్ని ఎంపిక చేసే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌ కన్నా రాయుడే మిడిల్‌ ఆర్డర్‌లో రాయుడే చక్కగా రాణించగలడని భావిస్తున్నారు సెలక్టర్లు.

'రాయుడు ఫామ్‌పై చాలా సంతోషంగా ఉంది. . అతడి ఆట చాలా ఉత్తేజాన్నిస్తోంది. తన ప్రదర్శనతో అతడు మా ముందు మరిన్ని ప్రత్యామ్నాయాలను ఉంచుతున్నాడు'' అని అని జాతీయ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు.

'రాయుడును తిరిగి జట్టులోకి తీసుకోవాలన్న అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా. ఎంతో నైపుణ్యాన్ని, ఫామ్‌ను అతడు చూపించాడు. వన్డే, టీ20ల్లో జట్టు ఎంపిక సమయంలో అతణ్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి'' అని మాజీ ఆటగాడు శివరామకృష్ణన్‌ చెప్పాడు. ''ఈ సీజన్‌లో రాయుడు బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. చాలా ఫిట్‌గా, దూకుడుగా కనిపిస్తున్నాడు. చాలా మంచి షాట్లు ఆడుతున్నాడు. అతడిలో ఇంకా చాలా క్రికెట్‌ ఉంది'' అని అన్నాడు.

2013లో తొలిసారిగా జట్టుకు ఎంపికైన రాయుడు 34 వన్డేలు, 6 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించగా చివరి వన్డే 2016, జూన్‌లో ఆడాడు. గత మూడు మ్యాచ్ లలో చెన్నై జట్టును గెలిపించడంలో, స్కోరును పరుగులు పెట్టించడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు.

Story first published: Friday, April 27, 2018, 10:12 [IST]
Other articles published on Apr 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X