న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జడేజాను జట్టు నుంచి తీసేయొద్దు, అతడు ఆడబట్టే ఫైనల్లో భారత్ నెగ్గింది'

Ravindra Jadeja should not have been dropped: Mohammad Azharuddin

హైదరాబాద్: ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను జట్టులో కొనసాగించాలని భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ అభిప్రాయపడ్డాడు. దుబాయి వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత్‌కు ఇది ఏడో ఆసియా కప్ టైటిల్ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్‌‌లో కీలక సమయంలో రవీంద్ర జడేజా రాణించి టీమిండియాకు విజయాన్ని సాధించి పెట్టాడని అజహరుద్దీన్‌ కొనియాడాడు. ఫైనల్లో జడేజా 33 బంతుల్లో 23 పరుగులు చేశాడు.

ఆసియాకప్ ఆఖరి ఓవర్‌లో సింగిల్స్: ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచి భారత్ విజయంఆసియాకప్ ఆఖరి ఓవర్‌లో సింగిల్స్: ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచి భారత్ విజయం

ముఖ్యంగా భువనేశ్వర్‌(31 బంతుల్లో 21)తో కలిసి ఏడో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న జడేజా ఈ టోర్నీలో అటు బంతి, ఇటు బ్యాట్‌తో మెరిశాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

1
44058

శనివారం ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అజహరుద్దీన్ మాట్లాడుతూ "జడేజాను జట్టు నుంచి తీసేయవద్దు. ఆసియాకప్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో జడేజా త్వరగా పెవిలియన్‌ చేరుంటే.. భారత్‌ మ్యాచ్ నెగ్గేది కాదు. భారత జట్టు 11 మంది సభ్యుల్లో అతనూ ఒకడు" అని తెలిపాడు.

సూపర్‌-4లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో జడేజా మొత్తం ఏడు వికెట్లు తీసి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక, బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో 6 ఓవర్లు వేసిన జడేజా 31 పరుగుల సమర్పించుకున్నాడు. అయితే, వికెట్లు తీయడంలో మాత్రం విఫలమయ్యాడు.

భారత్ Vs బంగ్లా ఆసియాకప్ ఫైనల్: ఏడోసారి టైటిల్, నమోదైన రికార్డులివేభారత్ Vs బంగ్లా ఆసియాకప్ ఫైనల్: ఏడోసారి టైటిల్, నమోదైన రికార్డులివే

ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. చాహల్‌ వేసిన 28వ ఓవర్‌లో లిటన్‌ దాస్‌ ఆడిన షాట్‌ను ఎక్స్‌ట్రా కవర్‌లో జడేజా అద్భుతంగా డైవ్‌ చేస్తూ ఆపేశాడు. ఇది ఊహించని మిథున్‌ అప్పటికే నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌ నుంచి పరుగు తీయగా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ఒకే ఎండ్‌లో ఉన్నట్టయింది.

ఈ సమయంలో మెరుపు వేగంతో స్పందించిన జడేజా.. ముందు ధోనీ వైపు బంతిని వేయాలని ప్రయత్నించినప్పటికీ, ఆ తర్వాత అతడు నాన్‌స్ట్రయిక్‌ వైపు విసరాలని చూపించడంతో అంతే చురుగ్గా చాహల్‌కు బంతిని అందివ్వడంతో అతడు వికెట్లను పడగొట్టాడు. దీంతో మహ్మద్‌ మిథున్‌ (2) పెవిలియన్‌కు చేరాడు.

ఫైనల్లో చివర్లో ఆడలేని పరిస్థితుల్లో ఉన్న కేదార్ జాదవ్‌ బ్యాటింగ్‌ చేయడాన్ని కూడా అజహరుద్దీన్‌ కొనియాడాడు. ఇక, ఆసియాకప్ టోర్నీలో ఓటమనేదే లేకుండా భారత్‌కు ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా అజహరుద్దీన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ చాలా కూల్‌గా, ఏమాత్రం భయంలేకుండా కనిపించాడని చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, September 29, 2018, 16:58 [IST]
Other articles published on Sep 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X