న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు: జడేజాపై దాదా ప్రశంసల వర్షం

Ravindra Jadejas improvement with bat so important: Sourav Ganguly

హైదరాబాద్: కటక్ వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ చివరలో పేసర్ శార్దూల్‌ ఠాకూర్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయడంతో మరో ఎనమిది బంతులు మిగులుండగానే టీమిండియా గెలిచింది.

ఈ విజయంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో కీలకంగా వ్యవహారించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒత్తిడిలో జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని గంగూలీ తన ట్విట్టర్‌లో కొనియాడాడు.

Yearend 2019: 157 wins in 249: వన్డేల్లో ఈ దశాబ్దం టీమిండియాదే!Yearend 2019: 157 wins in 249: వన్డేల్లో ఈ దశాబ్దం టీమిండియాదే!

గంగూలీ తన ట్విట్టర్‌లో "టీమిండియా మరో విజయం. అభినందనలు. ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో గొప్పగా మెరుగయ్యాడు. ఇది ఎంతో కీలకం" అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికే వన్డేల్లో 11 హాఫ్ సెంచరీలు చేసిన జడేజా ఆదివారం నాటి మ్యాచ్‌లో 31 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఆ 30 నిమిషాలు మినహాయిస్తే.. 2019 టీమిండియాకు ఉత్తమ ఏడాది: కోహ్లీఆ 30 నిమిషాలు మినహాయిస్తే.. 2019 టీమిండియాకు ఉత్తమ ఏడాది: కోహ్లీ

గత కొన్నేళ్లుగా ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా ఎంతో పరిణితిని కనబరుస్తున్నాడు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో జట్టుని ఆదుకుంటున్నాడు. వన్డేల్లో 2188 పరుగులు చేసిన జడేజా... టెస్టుల్లో 1844 పరుగులు చేశాడు. మొత్తంగా 25 హాఫ్ సెంచరీలు (టెస్టుల్లో 14, వన్డేల్లో 11)తో పాటు టెస్టు క్రికెట్‌లో సెంచరీ కూడా సాధించాడు.

Story first published: Monday, December 23, 2019, 15:35 [IST]
Other articles published on Dec 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X