న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా అద్భుతమైన త్రో.. పెవిలియన్‌కు నీషమ్‌.. నెటిజన్లు ఫిదా!!

India vs New Zealand, 2nd ODI : Ravindra Jadeja Rocket Throw | జడేజా నువ్వు సూపరో సూపర్
Ravindra Jadeja rocket throw: Netizens cant keep calm as all-rounder runs-out James Neesham


ఆక్లాండ్‌:
టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు రనౌట్ల రూపంలో కీలక వికెట్లు చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20లో కోలిన్ మున్రోను విరాట్‌ కోహ్లీ అద్భుతమైన రీతిలో రనౌట్‌ చేసాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో నికోలస్‌ను సైతంకోహ్లీనే రనౌట్‌ చేశాడు. ఈ రెండు సందర్భాల్లోనూ న్యూజిలాండ్‌ అనవసరపు పరుగు కోసం యత్నించి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు రెండో వన్డేలో కూడా అదే పొరపాటును చేసింది.

<strong>స్మిత్‌, కోహ్లీలో ఎవరు బెస్ట్?.. సచిన్‌ ఏమన్నాడంటే?!!</strong>స్మిత్‌, కోహ్లీలో ఎవరు బెస్ట్?.. సచిన్‌ ఏమన్నాడంటే?!!

రెండో వన్డే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్న మార్టిన్ గప్టిల్‌ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సింగిల్‌ కోసం ప్రయత్నించి వికెట్‌ కోల్పోయాడు. రవీంద్ర జడేజా వేసిన 30 ఓవర్‌ రెండో బంతిని రాస్‌ టేలర్‌ షార్ట్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా రివర్స్‌ స్వీప్‌ ఆడాడు.సింగిల్‌ కోసం ఇద్దరూ పరుగెత్తగా.. శార్దూల్‌ ఠాకూర్‌ బంతిని అందుకుని కీపర్‌ లోకేష్ రాహుల్‌కు విసిరాడు. వెంటనే రాహుల్‌ వికెట్లను గిరటేసాడు. రనౌట్‌ అని కచ్చితంగా గప్టిల్‌కు తెలియడంతో.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం కోసం వేచి ఉండకుండానే మైదానాన్ని వీడాడు.

గప్టిల్‌ పెవిలియన్‌కు చేరిన తర్వాత కెప్టెన్ టామ్‌ లాథమ్‌ (7)ను ఎల్బీగా ఔట్‌ చేసి జడేజా బ్రేక్‌ ఇచ్చాడు. ఆపై కాసేపటికి జేమ్స్‌ నీషమ్‌ (3)ను జడేజా అద్భుతమైన త్రోతో రనౌట్‌ చేసి ఔరా అనిపించాడు. నవదీప్‌ సైనీ వేసిన 35 ఓవర్‌ రెండో బంతిని టేలర్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోకి షార్ట్‌ ఆడాడు. ఇద్దరూ సింగిల్‌కు యత్నించగా.. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా డైరెక్ట్‌ త్రో విసిరి స్ట్రైకర్స్‌ ఎండ్‌లోని బెయిల్స్‌ పడగొట్టాడు. నీషమ్‌ క్రీజ్‌లోకి రావడానికి ముందే జడేజా వేసిన బంతి వికెట్లను గిరాటేసింది. జడేజా ఫీల్డింగ్ విన్యాసాలతో నెటిజన్లు ఫిదా అయ్యారు. అద్భుత ఫీల్డర్ అంటూ జడేజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జడేజా ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో రెచ్చిపోవడంతో కివీస్ జట్టు ఒక్కసారిగా 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే టేలర్‌ వికెట్ కాపాడుకుంటూ హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. దీంతో కివీస్ స్కోర్ 250 దాటింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 49 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. క్రీజ్‌లో టేలర్‌ (67), కైల్‌ జెమీసన్‌ (18) ఉన్నారు. టామ్ లాథమ్‌ (7), జిమ్మీ నీషమ్‌ (3), కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ (5), మార్క్ చాప్మన్ (1)లు నిరాశపరిచారు.

Story first published: Saturday, February 8, 2020, 11:26 [IST]
Other articles published on Feb 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X