న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవిచంద్రన్‌ అశ్విన్‌ గొప్ప కెప్టెన్: ఆండ్రూ టై

IPL 2019 : Ravichandran Ashwin Is A Great Captain For Kings XI Punjab Says Andrew Tye || Oneindia
Ravichandran Ashwin is a great leader says Andrew Tye

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓకెప్టెన్ అని ఆ జట్టు బౌలర్ ఆండ్రూ టై పేర్కొన్నారు. బుధవారం రాత్రి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్‌ చివరి వరకూ పోరాడి బోల్తా కొట్టింది.

ఏం చేయడానికైనా సిద్ధం:

ఏం చేయడానికైనా సిద్ధం:

తాజాగా పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై మాట్లాడుతూ... 'గత సీజన్‌లో బాగా రాణించాను. ఈ సారి మాత్రం నా ప్రదర్శన ఆ స్థాయిలో లేదు. అయితే ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. జట్టు విజయాల్లో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కొన్ని మ్యాచ్‌లలో ఆడకపోవడం చాలా బాధగా ఉంటోంది. అయితే ఇదంతా ఆటలో సహజమే. జట్టుకు ఎప్పుడు ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను' అని టై తెలిపారు.

అశ్విన్‌ ఓ గొప్ప కెప్టెన్:

అశ్విన్‌ ఓ గొప్ప కెప్టెన్:

'అశ్విన్‌ ఓ గొప్ప కెప్టెన్. మ్యాచ్‌కు ముందే సన్నద్ధం అవుతాడు. విజయ అవకాశాలను అసలు వదులుకోడు. ప్రత్యర్థి వీడియోలు వీక్షించి కొత్త ఆలోచనలతో బౌలింగ్ చేస్తాడు. జట్టు ఆటగాళ్లందరూ అతడిని ఇష్టపడతారు. మాకు మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది, ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. మాకు ఇంకా ప్లే ఆఫ్ అవకాశం ఉంది. ఈ సారి ఫైనల్‌ చేరి టైటిల్‌ గెలుస్తాం' అని టై ఆశాభావం వ్యక్తం చేసాడు.

బెంగళూరు హ్యాట్రిక్‌:

బెంగళూరు హ్యాట్రిక్‌:

బెంగళూరు వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగినమ్యాచ్‌లో బెంగళూరు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో బెంగళూరు హ్యాట్రిక్‌ కొట్టింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్‌ (44 బంతుల్లో 82 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), స్టొయినిస్‌ (34 బంతుల్లో 46 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. లక్ష్య ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్‌ (28 బంతుల్లో 46; 1 ఫోర్, 5 సిక్స్‌లు), రాహుల్‌ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్‌)లు ఆకట్టుకున్నారు. డివిలియర్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Friday, April 26, 2019, 10:19 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X