న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రధాన కోచ్‌ పదవి నిబంధనలు అప్పుడు ఉంటే రవిశాస్త్రి ఎంపికయ్యే వాడు కాదు

India vs West Indies 2019 : Ravi Shastri Would Never Have Current BCCI Coaching Eligibility Norms
Ravi Shastri would never have made it under current BCCI coaching eligibility norms

ప్రస్తుతం ప్రధాన కోచ్‌ పదవికి ఉన్న నిబంధనలు 2017లో ఉంటే టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యే అవకాశం లేదు. విండీస్ టూర్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించిన అందరి పదవీకాలం ముగియనుంది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఈ సారి కొత్తగా వయసు, ఎక్స్‌పీరియన్స్ లాంటి నిబంధనలను విధించింది.

హెడ్ కోచ్ నిబంధనలు:

హెడ్ కోచ్ నిబంధనలు:

హెడ్ కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది. దీని ప్రకారం.. కోచ్‌ పదవికి ఎంపిక అయ్యే అభ్యర్థికి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు లేదా అసోసియేట్‌ సభ్యదేశం/ ఏ-జట్టు/ఐపీఎల్‌ జట్టుకు మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. దీంతో పాటు ఆ అభ్యర్ధికి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం కూడా ఉండాలని నిబంధన పెట్టింది.

ఒక్క సిరీస్‌కు మాత్రమే:

ఒక్క సిరీస్‌కు మాత్రమే:

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి మళ్ళీ హెడ్ కోచ్ పదవి పొందడానికి బలమైన పోటీదారుగా ఉన్నాడు. అయితే 2017లో హెడ్ కోచ్‌గా ఎంపికైనప్పుడు కోచింగ్ అనుభవం నిబంధనలను పాటించినట్లయితే రవిశాస్త్రి ఎంపికయ్యే వాడు కాదు. 1982 నుండి 1992 వరకు భారతదేశంకు శాస్త్రి ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ అనంతరం క్రికెట్ బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేశాడు. అప్పటివరకు శాస్త్రికి ఎలాంటి కోచింగ్ అనుభవం లేదు. 2007లో బంగ్లాదేశ్‌లో జరిగిన సిరీస్‌కు మాత్రమే కోచ్‌గా ఉన్నాడు.

 2014లో జట్టు డైరెక్టర్‌గా:

2014లో జట్టు డైరెక్టర్‌గా:

బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ హయాంలో రవిశాస్త్రి మొదటిసారిగా 2014 ఆగస్టులో భారత జట్టు డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ పర్యటన జరుగుతోంది. అప్పటికే డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా విఫలమయ్యాడు, ప్రపంచకప్ 2015 దగ్గరలో ఉండడంతో రవిశాస్త్రి పగ్గాలు అందుకున్నాడు. అనిల్ కుంబ్లే అనంతరం 2017లో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. ఇప్పటివరకు హెడ్ కోచ్‌గా శాస్త్రి కొనసాగుతున్నాడు.

సెమీ-ఫైనల్స్‌ను అధిగమించడంలో విఫలం:

సెమీ-ఫైనల్స్‌ను అధిగమించడంలో విఫలం:

ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్ వీరిద్దరి కలయికలో ఆస్ట్రేలియాలో జరిగిన చారిత్రాత్మక సిరీస్ విజయంతో పాటు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మధ్య భారత్ మంచి విజయాలు అందుకుంది. ప్రస్తుతం భారత్ వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మంచి స్థానాల్లో ఉంది. ఏదేమైనా శాస్త్రి ఆధ్వర్యంలో ప్రపంచకప్ 2015, టీ20 ప్రపంచకప్ 2016, ప్రపంచకప్ 2019లో భారత్ సెమీ-ఫైనల్స్‌ను అధిగమించడంలో విఫలమైంది.

Story first published: Thursday, July 18, 2019, 10:42 [IST]
Other articles published on Jul 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X