న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రవిశాస్త్రిని వదిలిపెట్టం.. అన్ని విధాలుగా వాడుకుంటాం'

Ravi Shastri will also be involved with NCA during his coaching tenure says Sourav Ganguly

ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రిని అసలు వదిలిపెట్టం. టీమిండియాతో పాటు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు రవిశాస్త్రి సేవలు వాడుకుంటాం అని బీసీసీఐ అధ్యక్షుడు మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ అన్నారు. బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్‌ గంగూలీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. గంగూలీ తాను అనుకున్న పనులన్నీ రాకెట్‌ వేగంతో పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌సీఏ అభివృద్ధి ప్రణాళికపై దాదా దృష్టి సారించారు.

<strong>అనుష్క శర్మ ఫైర్: వివాదాల్లోకి నా పేరు లాగొద్దు.. ఇక్కడితో వదిలేయండి!!</strong>అనుష్క శర్మ ఫైర్: వివాదాల్లోకి నా పేరు లాగొద్దు.. ఇక్కడితో వదిలేయండి!!

 శాస్త్రి సేవలను వాడుకుంటాం:

శాస్త్రి సేవలను వాడుకుంటాం:

బుధవారం చిన్నస్వామి స్టేడియంలో ఎన్‌సీఏ చీఫ్ రాహుల్‌ ద్రవిడ్‌తో దాదా భేటీ అయ్యారు. అకాడమీ అభివృద్ధి, మౌలిక వసతులపై ఇద్దరు చర్చించారు. తాజాగా గంగూలీ మాట్లాడుతూ... 'రవిశాస్త్రి పనితీరు బాగుంది. శాస్త్రి కోచ్‌గా ఉన్నంత వరకు ఎన్‌సీఏకు మరింత సహకారం అందించేలా ఒక వ్యవస్థను సృష్టిస్తున్నాం. శాస్త్రి సేవలను వాడుకుంటాం. ఎన్‌సీఏను మరింత ఉన్నత స్థానాలకు చేర్చాలనుకుంటున్నాం. రాహుల్‌ ద్రవిడ్‌, పరాస్‌ మహంబ్రే, భరత్‌ అరుణ్‌ సైతం మాతో ఉన్నారు' అని గంగూలీ అన్నారు.

అకాడమీపై రెండు గంటలు చర్చించాం

అకాడమీపై రెండు గంటలు చర్చించాం

'ద్రవిడ్‌తో సమావేశం బాగా జరిగింది. అతడు భారత క్రికెట్లో ఒక దిగ్గజం. ఎన్‌సీఏ అధినేత. అకాడమీపై పూర్తిగా చర్చించాం. సమావేశం దాదాపు రెండు గంటలు సాగింది. సరికొత్త ఎన్‌సీఏను నిర్మిస్తున్నాం. అకాడమీని ముందుకు తీసుకెళ్లడం ఎలాగో తెలుసుకున్నాం. ఎన్‌సీఏలో బెంగళూరు నడిబొడ్డున ఉంది. మంచి స్థలం దొరికింది. బీసీసీఐ వారి వసతులను వాడుకుంటున్నందుకు కర్ణాటక క్రికెట్‌ సంఘం ఒక్క పైసా వసూలు చేయలేదు. ఎన్‌సీఏ ఎంత పెద్దగా ఉంటే మనకు అంత మంచిది' అని గంగూలీ పేర్కొన్నారు.

 ఏటా రూ.10 కోట్లు

ఏటా రూ.10 కోట్లు

ఇటీవలే రెండోసారి టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించబడిన రవిశాస్త్రి 2021 వరకు పనిచేస్తారు. జాతీయ జట్టు సేవల కోసమే ఆయనకు ఏటా రూ.10 కోట్లను పారితోషికంగా చెల్లిస్తున్నారు. మరోవైపు సౌరవ్‌ గంగూలీ కూడా గత నెల 23న బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జాతీయ జట్టు, ఎన్‌సీఏ మధ్య సమన్వయం సృష్టించేందుకు శాస్త్రిని రెండు విధాలుగా ఉపయోగించుకోవాలని గంగూలీ చూస్తున్నారు.

విమానాశ్రయంలో గంగూలీ

విమానాశ్రయంలో గంగూలీ

సమావేశం అనంతరం గంగూలీ బెంగళూరు విమానాశ్రయంలో ఉండగా.. అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇది గమనించిన దాదా.. విమానాశ్రయంలోని చెకింగ్ పాయింట్ వద్ద అభిమానులు, భద్రతా సిబ్బందితో సెల్ఫీ తీసుకున్నారు. దీంతో విమానాశ్రయంలోని అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.

అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు

అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు

అభిమానులతో సెల్ఫీ తీసుకొన్న ఫొటోని గంగూలీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'బెంగళూరు విమానాశ్రయంలో చెకింగ్ పాయింట్ వద్ద.అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. చాలా ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Friday, November 1, 2019, 11:52 [IST]
Other articles published on Nov 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X