న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారణమిదే: వరల్డ్‌కప్ గెలిచినా కోచ్‌గా రవిశాస్త్రికి కొనసాగింపు ఉండదు

ICC Cricket World Cup 2019: Ravi Shastri's Contract Doesn't Have Extension Clause Says BCCI Official
Ravi Shastris contract doesnt have extension clause: BCCI official

హైదరాబాద్: గత కొన్నాళ్లుగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అద్భుత విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశాలలో అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఏ కెప్టెన్‌కీ సాధ్యంకాని రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి నాయకత్వంలో తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్‌ను నెగ్గి చరిత్ర సృష్టించింది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో కూడా కోహ్లీసేన రాణిస్తే హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని కొనసాగిస్తారనే వార్తలు వచ్చాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ప్రస్తుత కాంట్రాక్టు ప్రకారం

ప్రస్తుత కాంట్రాక్టు ప్రకారం

ప్రస్తుత కాంట్రాక్టు ప్రకారం త్వరలో ఇంగ్లాండ్‌ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌ కోచ్‌గా అతడికి చివరి టోర్నీ. వరల్డ్‌కప్ తర్వాత జరిగే వెస్టిండీస్‌ పర్యటనకు శాస్త్రితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కొనసాగేలా బీసీసీఐ తాత్కాలిక కాంట్రాక్టు ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.

రవిశాస్త్రికి పొడిగింపు ఉండబోదు

రవిశాస్త్రికి పొడిగింపు ఉండబోదు

దీనిపై బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ, టీమిండియా వరల్డ్‌కప్‌ను గెలిచినా రవిశాస్త్రికి పొడిగింపు ఉండబోదని ఆయన తెలిపారు. రవిశాస్త్రి మళ్లీ ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాల్సిందేనని తెలిపారు. రవిశాస్త్రితో చేసుకున్న ఒప్పందంలో పొడిగింపు, రెన్యువల్‌ నిబంధన లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. ప్రపంచకప్‌ తర్వాత బీసీసీఐ కొత్త కోచ్‌ల నియామకానికి ఇంటర్వ్యూల ప్రకటన ఇవ్వనుంది.

2017లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రవిశాస్త్రి

2017లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రవిశాస్త్రి

2017లో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ పదవి నుంచి దిగిపోయాక రవిశాస్త్రి కోచ్‌ అయిన సంగతి తెలిసిందే. "కుంబ్లే కాలం నుంచి కోచ్‌, సహాయ సిబ్బంది ఒప్పందాల్లో పొడిగింపు, రెన్యువల్‌ నిబంధన ఉండటం లేదు. శాస్త్రి నేతృత్వంలో టీమిండియా ప్రపంచకప్‌ గెలిచినా, ముఖాముఖికి నేరుగా షార్ట్‌లిస్ట్‌ అయినా అతడు తాజా ఎంపిక ప్రక్రియను అనుసరించాల్సిందే" అని తెలిపారు.

ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది

ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది

"శాస్త్రి, బంగర్‌, భరత్‌ అరుణ్‌, ఆర్‌. శ్రీధర్‌ ఒప్పందాలు ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్‌ రోజున ముగుస్తాయి. టెస్టు ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌ పర్యటనకు కోహ్లీసేన వెళ్లే ముందే ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకు కేవలం 14 రోజుల సమయమే ఉంది. ప్రపంచకప్‌లో భారత జట్టు కనీసం సెమీస్‌ చేరితేనే శాస్త్రి మళ్లీ కోచ్‌ పదవి చేపడతాడు" అని అన్నారు.

Story first published: Thursday, March 21, 2019, 13:39 [IST]
Other articles published on Mar 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X