న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రవిశాస్త్రి ఎంపిక సరైంది, కానీ...': బాంబు పేల్చిన సౌరవ్ గంగూలీ

‘Ravi Shastri is the right choice, but...’: Sourav Ganguly on India head coach

హైదరాబాద్: 2016లో హెడ్ కోచ్ పదవికి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్నప్పుడు గంగూలీ, లక్ష్మణ్, సచిన్ నేతృత్వంలోని సీఏసీ కమిటీ అతడిని పక్కన బెట్టింది. రవిశాస్త్రి కంటే హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే సూట్ అవుతాడని అతడికే పట్టం కట్టింది. ఆ సమయంలో గంగూలీ వల్లే తనకు హెడ్ కోచ్ పదవి దక్కలేదని రవిశాస్త్రి బహిరంగంగానే విమర్శించాడు.

ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేల మధ్య విభేధాలు తలెత్తడంతో కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేయడం... ఆ తర్వాత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి ఎంపికవడం తెలిసిందే. ఇటీవలే కపిల్ దేవ్ నేతృత్వంలోని సీఏసీ రెండోసారి రవిశాస్త్రికే హెడ్ కోచ్‌గా పట్టం కట్టింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఎంపికపై తాజాగా గంగూలీ స్పందించాడు.

విశాఖ టెస్టులో ఆసక్తికర సన్నివేశం!: బంతి ఎక్కడుందో తెలుసా? (వీడియో)విశాఖ టెస్టులో ఆసక్తికర సన్నివేశం!: బంతి ఎక్కడుందో తెలుసా? (వీడియో)

కోచ్‌గా శాస్త్రి ఎంపిక

కోచ్‌గా శాస్త్రి ఎంపిక

భారత జట్టు కోచ్‌గా శాస్త్రిని ఎంపిక చేసేటప్పుడు ఇతరులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో సెలక్షన్‌ కమిటికి వేరే దారిలేకపోయిందని దాదా అన్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి ముందు రెండు టీ20 వరల్డ్‌కప్(2020, 2021)లు ఉన్నాయని ... ఆ పెద్ద టోర్నీల్లో టీమిండియాను విజయపథంలో నడిపించి అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించుకోవాలని అన్నాడు.

రవిశాస్త్రి ఎంపిక సరైంది

రవిశాస్త్రి ఎంపిక సరైంది

"హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక సరైంది. కోచ్‌గా శాస్త్రిని ఎంపిక చేసేటప్పుడు ఇతరులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో సెలక్షన్‌ కమిటికి వేరే దారిలేకపోయింది. గత ఐదేళ్లుగా అతడు జట్టుతో ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు మరో రెండేళ్లు కొనసాగే అవకాశం లభించింది, టీమిండియాతో ఇన్నేళ్లు ప్రయాణించిన అవకాశం గతంలో ఎవరికీ రాలేదు" అని దాదా అన్నాడు.

2007లో టీమిండియా మేనేజర్‌గా

2007లో టీమిండియా మేనేజర్‌గా

రవిశాస్త్రి తొలిసారి 2007లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా టీమిండియా మేనేజర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2014లో టీమిండియా డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2017లో అనిల్‌ కుంబ్లే హెడ్ కోచ్‌గా తప్పుకున్నాక రవిశాస్త్రి ఒక్కడే దరఖాస్తు చేసుకోవడంతో అతడినే కోచ్‌గా ఎంపిక చేశారు.

ఆస్ట్రేలియాలో టెస్టు సిరిస్ విజయం

ఆస్ట్రేలియాలో టెస్టు సిరిస్ విజయం

రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా మంచి విజయాలనే నమోదు చేసింది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాల్లో టెస్టు సిరీస్‌లు ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియాలో విజయం సాధించి 72 ఏళ్ల రికార్డులను తిరిగరాసింది. 1983 వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి ఇప్పటివరకు భారత జట్టుకు ఒక్క ఐసీసీ ట్రోఫీ అందించలేదు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ చేతిలో ఓటమి

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ చేతిలో ఓటమి

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరినప్పటికీ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిపోయింది. ఇక, ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో సైతం సెమీస్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉన్నందున రవిశాస్త్రికి ఇదే మంచి అవకాశమని గంగూలీ అన్నాడు.

Story first published: Friday, October 4, 2019, 13:28 [IST]
Other articles published on Oct 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X