న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రషీద్ ఖాన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుని ఎవరికి అంకితమిచ్చాడో తెలుసా?

Rashid Khan dedicates Player of the Match award to retiring Nabi

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో తనకు లభించిన 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుని తన సహచర ఆటగాడు మహమ్మద్ నబీకి అంకితమిచ్చాడు రషీద్ ఖాన్. బంగ్లాదేశ్‌కు పసికూన ఆప్ఘనిస్థాన్ షాకిచ్చింది. చొట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ 224 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

స్పిన్‌తో తిప్పేసిన రషీద్: బంగ్లాతో ఏకైక టెస్టులో ఆప్ఘన్ భారీ విజయంస్పిన్‌తో తిప్పేసిన రషీద్: బంగ్లాతో ఏకైక టెస్టులో ఆప్ఘన్ భారీ విజయం

ఈ విజయంలో కెప్టెన్ రషీద్‌ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్టులో హాఫ్ సెంచరీతో పాటు 11 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందని అందరూ భావించినా... ఆప్ఘనిస్థాన్ మాత్రం అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుంది.

టెస్టు హోదా పొందిన తర్వాత

టెస్టు హోదా పొందిన తర్వాత

గతేడాది టెస్టు హోదా పొందిన తర్వాత టీమిండియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆప్ఘనిస్థాన్ ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆడిన మూడు టెస్టుల్లోనే ఆప్ఘనిస్థాన్ రెండు టెస్టుల్లో విజయం సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను రషీద్ ఖాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

రషీద్ ఖాన్ మాట్లాడుతూ

రషీద్ ఖాన్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా రషీద్ ఖాన్ మాట్లాడుతూ "లెజెండ్‌ నబీ జట్టుకు ఎన్నో సేవలు చేశాడు. అప్ఘనిస్థాన్‌ తరఫున సేవలు అందించినందుకు అతడికి ధన్యవాదాలు. మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అతడికి అంకితం చేస్తున్నాను. విజయంలో బ్యాట్స్‌మెన్ కీలకపాత్ర పోషించారు. వారు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. యువ బౌలర్లు రాణించారు. ఇక పొట్టి ఫార్మాట్‌పై మా దృష్టిని మళ్లిస్తాం" అని అన్నాడు.

టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడి

టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడి

కాగా, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కి ముందే ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. తాను ఆడిన రెండు టెస్టుల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 33 పరుగులే చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన నబీ... రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేసిన ఔటయ్యాడు.

టీ20ల్లో కీలక ఆటగాడు

టీ20ల్లో కీలక ఆటగాడు

ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మహ్మద్ నబీ కీలక ఆటగాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున నబీ ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా అందించాడు. ఆప్ఘనిస్థాన్ తరుఫున ఇప్పటివరకు 121 వన్డేలు, 67 టీ20లు, మూడు టెస్టులు ఆడాడు. కాగా, నవంబర్ 27వ తేదీన డెహ్రాడూన్ వేదికగా వెస్టిండిస్‌తో ఆప్ఘనిస్థాన్ మరో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది.

Story first published: Tuesday, September 10, 2019, 12:30 [IST]
Other articles published on Sep 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X