న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి స్పిన్నర్‌గా అరుదైన ఘనత: మలింగ సరసన రషీద్ ఖాన్

Rashid Khan becomes first spinner to take T20I hat-trick, joins Lasith Malinga in elite list

హైదరాబాద్: అప్ఘనిస్తాన్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొత్తం 5 వికెట్లు తీసి 27 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టి20ల్లో 'హ్యాట్రిక్‌' తీసిన ఏడో బౌలర్‌గా, తొలి స్పిన్నర్‌గా రషీద్‌ఖాన్‌ నిలిచాడు.

<strong>బ్యాటింగ్‌లో వైఫల్యం: విశాఖ టీ20లో భారత్ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ</strong>బ్యాటింగ్‌లో వైఫల్యం: విశాఖ టీ20లో భారత్ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ

టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు

టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు

గతంలో టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఆరుగురూ పేస్‌ బౌలర్లే (బ్రెట్‌ లీ, జాకబ్‌ ఓరమ్, టిమ్‌ సౌతీ,తిసారా పెరీరా, లసిత్‌ మలింగ, ఫహీమ్‌ అష్రఫ్‌) కావడం గమనార్హం. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ గుర్తింపు పొందాడు.

లసిత్‌ మలింగ సరసన రషీద్ ఖాన్

లసిత్‌ మలింగ సరసన రషీద్ ఖాన్

గతంలో శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ మాత్రమే (2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై) ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ జట్టులో మొహమ్మద్‌ నబీ (81) హాఫ్ సెంచరీ సాధించగా... హజ్రతుల్లా (31) ఫరవాలేదనిపించాడు.

వరుసగా హ్యాట్రిక్ వికెట్లు తీసిన రషీద్

వరుసగా హ్యాట్రిక్ వికెట్లు తీసిన రషీద్

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 15.5 ఓవర్లలో 153/3 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అయితే, ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ వేసిన రషీద్‌ చివరి బంతికి కెవిన్‌ ఓబ్రియన్‌ (74) పెవిలియన్‌కు చేర్చగా... ఆ తర్వాత 18వ ఓవర్‌ తొలి మూడు వరుస బంతులకు డాక్రెల్‌ (18), గెట్‌కెట్‌ (2), సిమి సింగ్‌ (0)లను పెవిలియన్‌ చేర్చాడు.

3-0తో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆప్ఘనిస్థాన్

3-0తో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆప్ఘనిస్థాన్

దీంతో ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. మూడో టీ20లో 32 పరుగుల తేడాతో ఆప్ఘనిస్థాన్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Story first published: Monday, February 25, 2019, 13:04 [IST]
Other articles published on Feb 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X