సన్‌రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ అరుదైన ఘనత

Posted By:
Rashid bowls 18 dots, joint-most by a spinner in IPL match

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. టోర్నీలో భాగంగా గురువారం నగరంలోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 13 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ https://telugu.mykhel.com/cricket/ipl-2018-hyderabad-news-tp244-s4/

అంతేకాదు మ్యాచ్‌లో 18 డాట్స్ బాల్స్ వేశాడు. తద్వారా ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక డాట్స్‌ బాల్స్‌ వేసిన మూడో క్రికెటర్‌గా రషీద్‌ నిలిచాడు. అంతకుముందు రవిచంద్రన్‌ అశ్విన్‌, అమిత్‌ మిశ్రా చెరో మ్యాచ్‌లో అత్యధికంగా 18 డాట్‌ బాల్స్‌ వేశారు. అశ్విన్ ఈ ఘనతను రెండు సార్లు సాధించడం విశేషం.

ఐపీఎల్ 11వ సీజన్‌ ఆరంభంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ 15 డాట్‌ బాల్స్‌ వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఉప్పల్ స్టేడియంలో గురువారం ముంబై ఇండియన్స్‌తో చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వికెట్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు రషీద్‌ ఖాన్‌కే దక్కింది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. హైదరాబాద్ బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌(45) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, దీపక్‌ హుడా(32 నాటౌట్‌) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

హైదరాబాద్ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన​ సాహాలు ఆరంభించారు. వీరిద్దరి జోడి తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలో 62 పరుగులు జోడించిన తర్వాత సాహా(22) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కేన్‌ విలియమ్సన్‌(6) పెవిలియన్‌కు చేరాడు. అదే సమయంలో దూకుడుగా ఆడుతోన్న శిఖర్‌ ధావన్‌ కూడా పెవిలియన్‌ చేరాడు.

దీంతో హైదరాబాద్‌ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత మనీష్‌ పాండే(11), షకిబుల్‌ హసన్‌(12)లు ఔటయ్యారు. ఈ క్రమంలో దీపక్‌ హుడా, యూసఫ్‌ పఠాన్‌లు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఈ సమయంలో పఠాన్‌(14) పరుగుల వద్ద ఔటయ్యాడు.

ఆ తర్వాతి బంతికే రషీద్‌ ఖాన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. 19 ఓవర్‌లో సిద్ధార్ధ్‌ కౌల్‌, సందీప్‌ శర్మలు సైతం పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ 137 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి.

ఈ సమయంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్‌ను బెన్ కటింగ్ చేతికి ఇచ్చాడు. తొలి బంతిని దీపక్ హుడా తొలి బంతిని సిక్స్‌ కొట్టగా, రెండో బంతి వైడ్‌ అయ్యింది. ఆ తర్వాత రెండో బంతికి పరుగు రాకపోగా, మూడో బంతికి పరుగు వచ్చింది. నాలుగో బంతిని స్టాన్‌లేక్‌ సింగిల్‌ తీసి హుడాకు స్టైకింగ్‌ ఇచ్చాడు.

ఇక ఐదో బంతికి మరో సింగిల్‌ రాగా, చివరి బంతిని స్టాన్‌ లేక్‌ ఫోర్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో మార్కండే నాలుగు వికెట్లు తీయగా, రెహమాన్ మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 13, 2018, 16:59 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి