న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అచ్చం అలాగే.. అప్పుడు కపిల్ దేవ్.. ఇప్పుడు రణ్‌వీర్‌ సింగ్‌!!

Ranveer Singh Recreates Iconic Moment When Kapil Dev Lifted The 1983 World Cup Trophy

ముంబై: టీమిండియా లెజెండరీ క్రికెటర్‌, మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌పై 'బయోపిక్‌' రూపొందుతున్న విషయం తెలిసిందే. '83' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు 'కబీర్‌ ఖాన్‌' దర్శకత్వం వహిస్తున్నారు. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌ను ఎలా సాధించింది అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హరియాణా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో బాలీవుడ్‌ స్టార్ హీరో 'రణ్‌వీర్‌ సింగ్‌' నటిస్తున్నారు. ఇక కపిల్ సతీమణి రోమి భాటియా పాత్రను దీపికా పదుకొణె పోషిస్తున్నారు.

<strong>బ్రెట్‌లీ బౌలింగ్.. చితకొట్టిన ఆరేళ్ల పాప (వీడియో)!!</strong>బ్రెట్‌లీ బౌలింగ్.. చితకొట్టిన ఆరేళ్ల పాప (వీడియో)!!

అచ్చం అలాగే

అచ్చం అలాగే

శనివారం '83' చిత్రం బృందం 1983లో కపిల్‌ దేవ్‌ ప్రపంచకప్‌ను అందుకుంటున్న సన్నివేశాన్ని పునఃసృష్టించింది. రణ్‌వీర్‌ సింగ్, కబీర్‌ ఖాన్, టెన్నిస్‌ ఆటగాడు మహేశ్‌ భూపతి ఆ చిత్రాన్ని ఆవిష్కరించారు. 1983లో ఉన్న కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్ సరిగ్గా సరిపోయారు. ఆ సన్నివేశం కూడా అచ్చం అలానే ఉంది. ప్రపంచకప్ అందుకొని చిరునవ్వులు చిందించడం, వెనకాల ఉన్న వారితో సహా అప్పటి సన్నివేశంను ప్రతిబింబించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రోఫీ అందుకొనే మధుర క్షణం

ట్రోఫీ అందుకొనే మధుర క్షణం

మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ తొలి ప్రపంచకప్‌ను అందుకోవడం ప్రత్యక్షంగా ఎంత మంది చూసుంటారు. అప్పుడు లైవ్ ప్రసారాలు కూడా తక్కువే. ఎంతో మందికి ఉదయం పేపర్ చూస్తే కానీ విషయం తెలియరాలేదు. ఇక ఈ తరం క్రికెటర్లలో చాలామంది అప్పటికి పుట్టనే లేదు కూడా. ఇప్పడున్న క్రికెట్‌ అభిమానుల్లో ఆ మధుర క్షణాన్ని వీక్షించింది కొద్ది మందే. అయితే ఆ సన్నివేశాన్ని మళ్లీ మన కళ్ల ముందుకు తీసుకొచ్చింది '83' చిత్ర బృందం.

శ్రీకాంత్‌ పాత్రలో జీవా

శ్రీకాంత్‌ పాత్రలో జీవా

లెజండరీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తహీర్‌ రాజ్‌ భాసిన్‌ నటిస్తున్నాడు. కెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్‌ పాటిల్‌, బల్వీందర్‌ సింగ్‌ పాత్రలో అమ్మీ విర్క్, సయ్యద్‌ కిర్మాణి పాత్రలో సాహిల్‌ ఖట్టర్‌ నటిస్తున్నారు. ఇక కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ఇదివరకే గావస్కర్‌, శ్రీకాంత్‌ పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లు విడుదల అయ్యాయి.

ఏప్రిల్ 10న విడుదల

'83' చిత్రం బృందం గత జనవరి నెలలోనే ఓ పోస్టర్‌ను విడుదల చేసి అందులో జీవాను పరిచయం చేసింది. కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో జీవా అద్భుతంగా కనిపించాడు. పాడ్స్, హెల్మెట్, బ్యాట్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రం 2020 ఏప్రిల్ 10న హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

Story first published: Saturday, March 7, 2020, 18:14 [IST]
Other articles published on Mar 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X