న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఐసీసీ ర్యాంకులు వరల్డ్‌కప్ విజేతను నిర్ణయించలేవు"

Rankings wont mean anything at ICC World Cup 2019: Dale Steyn

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్, ఇండియా జట్లు టైటిల్ ఫేవరేట్లుగా ఉన్నాయి. అయితే, ఈ మెగా టోర్నీలో ఐసీసీ ర్యాంకులు వరల్డ్‌కప్ నెగ్గే అవకాశాలను ప్రభావితం చేయలేవని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్ 2019 సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో డేల్ స్టెయిన్‌ను ఎవరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ సీజన్‌కు స్టెయిన్ దూరమయ్యాడు. అయితే, ఆర్సీబీ బౌలర్ నాథన్ కౌల్టర్‌ నైల్‌ గాయంతో టోర్నీకి దూరం కావడంతో స్టెయిన్‌కు మళ్లీ పిలుపొచ్చింది.

డెల్ స్టెయిన్ మాట్లాడుతూ

డెల్ స్టెయిన్ మాట్లాడుతూ

శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో డేల్ స్టెయిన్‌ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో డెల్ స్టెయిన్ మాట్లాడుతూ "ఐసీసీ ర్యాంకులు వరల్డ్‌కప్ నెగ్గే అవకాశాలను ప్రభావితం చేయలేవు. ర్యాంకింగ్స్ ప్రధానమైతే వెస్టిండీస్‌ది ఏ ర్యాంకో కూడా తనకు తెలియదు. అయితే, ఆ జట్టు వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆసీస్ కూడా ఓడింది, కానీ ప్రస్తుతం విజయాలు సాధిస్తోంది" అని అన్నాడు.

వరల్డ్‌కప్ టైటిల్‌ గెలిచే అవకాశాలు

వరల్డ్‌కప్ టైటిల్‌ గెలిచే అవకాశాలు

"ప్రస్తుతం ప్రతి జట్టుకూ వరల్డ్‌కప్ టైటిల్‌ గెలిచే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్ జట్టు ఇంగ్లాండ్‌లో ఆడుతోంది. గత కొన్ని నెలలుగా ఇంగ్లాండ్ వైట్ బాల్‌తో మంచి క్రికెట్ ఆడుతోంది. అక్కడికి వెళ్లి... ఇంగ్లాండ్ పరిస్థితులను ఆకలింపు చేసుకుని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే మిగిలుంది" అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.

రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆడిన దక్షిణాఫ్రికా

రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆడిన దక్షిణాఫ్రికా

ఈ ఏడాది జూన్‌లో 36వ పడిలోకి అడుగుపెట్టనున్న డేల్ స్టెయిన్‌ దక్షిణాఫ్రికా తరఫున రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆడాడు. అయితే, ఈ వరల్డ్‌కప్‌లో గనుక చోటు దక్కించుకుంటే మూడోసారి అవుతుంది. ఇక సఫారీ జట్టుపై డేల్ స్టెయిన్ "ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న డుప్లెసీస్‌, క్వింటన్ డికాక్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, కగిసో రబాడ ఇప్పటికే రాణిస్తున్నారు" అని అన్నాడు.

అందరూ మ్యాచ్‌ విన్నర్లే

అందరూ మ్యాచ్‌ విన్నర్లే

"వరల్డ్‌కప్‌లో కూడా వీళ్లు రాణిస్తారన్న నమ్మకం ఉంది. మా జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. ఇవన్నీ పక్కనపెడితే టోర్నీలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యం. మా జట్టుకు ప్రదర్శనతో పాటు కొంచెం అదృష్టం కూడా కావాలి. ఎందుకంటే ఒకే ఒక్క నోబాల్‌ కూడా టోర్నమెంట్‌ను గెలిపించగలదు" అని స్టెయిన్‌ పేర్కొన్నాడు.

చివరగా ఆడిన 13 వన్డేల్లో 11 మ్యాచ్‌ల్లో విజయం

చివరగా ఆడిన 13 వన్డేల్లో 11 మ్యాచ్‌ల్లో విజయం

దక్షిణాఫ్రికా జట్టు ఏడాదిన్నర నుంచి ఒక్క వన్డే సిరీస్‌‌ను కూడా కోల్పోలేదని.... జట్టు దృఢంగా ఉందని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు చివరగా ఆడిన 13 వన్డేల్లో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2015లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైంది. సఫారీలు ఒక్కసారి కూడా వరల్డ్‌కప్‌ను నెగ్గలేదు. టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా మే 30న ఇంగ్లాండ్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Thursday, April 18, 2019, 15:14 [IST]
Other articles published on Apr 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X