న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ranji Trophy Final : సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ వల్ల ముంబైకి గౌరవప్రదమైన స్కోరు.. రసవత్తరంగా ఫైనల్ పోరు

Ranji Trophy Final: Sarfaraz Khan dedicated Century helps to Mumbai to score 378 in first innings

రంజీ ట్రోఫీ 2021 - 22లో ముంబై వర్సెస్ మధ్యప్రదేశ్ జట్లు ఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. 42వ సారి రంజీ ట్రోఫీ గెలిచి తమకు ఎదురులేదని చూపించాలని ముంబై తహతహలాడుతుండగా.. ఒక్కసారి అయినా రంజీ ట్రోఫీ గెలిచి తమ చిరకాల కల నెరవేర్చుకోవాలని మధ్యప్రదేశ్ గట్టి పట్టుదలతో ఆడుతోంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ ప్రారంభం కాగా.. తొలుత టాస్ గెలిచిన ముంబై మొదటి రోజు ఆట ముగిసే టైంకు 90ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 248పరుగులు చేసింది.

తొడ కొట్టి మరీ తానేంటో చూపించాడు

తొడ కొట్టి మరీ తానేంటో చూపించాడు

ఇక రెండో రోజు గురువారం బరిలోకి దిగిన ముంబైను సర్ఫరాజ్ ఖాన్ (134పరుగులు 243బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీతో ఆదుకున్నాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా మొండిగా క్రీజులో నిలబడి మధ్యప్రదేశ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. సెంచరీ చేసిన తరువాత సర్ఫరాజ్ తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. గ్రౌండ్లో ఏడుస్తూ పరిగెత్తుతూ సెలబ్రేషన్లు చేసుకున్నాడు. తొడ కొట్టి మరీ తానంటే ఇది అని సింబాలిక్‌గా చూపించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 374పరుగులు

తొలి ఇన్నింగ్స్‌లో 374పరుగులు

ముంబై ప్లేయర్లు కేప్టెన్ పృథ్వీ షా-47, యశస్వి జైస్వాల్-78, అర్మాన్ జాఫర్-26, సువేద్ పార్కర్-18, హార్దిక్ తమోరె-24, షామ్స్ ములాని-12, తనుష్ కొటియాన్-15, ధవల్ కులకర్ణి-1, తుషార్ దేశ్ పాండే - 6, మోహిత్ అవస్థీ - 7 పరుగులు చేశారు. ఇక 127.4ఓవర్లలో 10వికెట్లు కోల్పోయి ముంబై జట్టు 374పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇక మధ్యప్రదేశ్ బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4, అనుభవ్ అగర్వాల్ 3, సారాన్స్ జైన్ 2, కుమార్ కార్తీకేయ 1 వికెట్‌తో రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 14ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 36పరుగులు చేసింది. హిమాన్షు మంత్రి 25పరుగుల నాటౌట్, యష్ దుబే 11పరుగులు నాటౌట్ క్రీజులో ఉన్నారు.

మధ్యప్రదేశ్‌కు ఇదో గొప్ప అవకాశం

మధ్యప్రదేశ్‌కు ఇదో గొప్ప అవకాశం

భారత దేశవాళీ క్రికెట్లో పేరెన్నికదగ్గ టోర్నమెంట్‌గా రంజీ ట్రోఫీకి పేరుంది. ఇక ఈ రంజీ టోర్నమెంట్లో ముంబై జట్టు ఇప్పటివరకు 41సార్లు విజేతగా నిలిచి ఈ టోర్నీలో ఆల్ టైం ఫేవరెట్ జట్టుగా తన పేరు లిఖించుకుంది. ఇక ఆ జట్టు మొత్తంగా 46 సార్లు ఫైనల్‌ చేరింది. మరోవైపు మధ్యప్రదేశ్‌ జట్టు మాత్రం ఒక్కసారి కూడా రంజీ టైటిల్‌ గెలవలేదు. ఇక 23ఏళ్ల క్రితం ఒక్కసారి ఆ జట్టు ఫైనల్ చేరినా.. ట్రోఫీ గెలవలేక రన్నరప్‌గా మిగిలిపోయింది. ఈసారి ఆ జట్టుకు గెలవడానికి గొప్ప అవకాశముంది. మొదటి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధిస్తే.. రెండో ఇన్నింగ్స్ డ్రా అయినా ఆ జట్టు విజేతగా నిలుస్తుంది.

తుది జట్లు

మధ్యప్రదేశ్ : యష్ దూబే, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), శుభమ్ S శర్మ, రజత్ పాటిదార్, ఆదిత్య శ్రీవాస్తవ (కెప్టెన్), అక్షత్ రఘువంశీ, పార్థ్ సహాని, సరాంశ్ జైన్, కుమార్ కార్తికేయ, అనుభవ్ అగర్వాల్, గౌరవ్ యాదవ్

ముంబై : పృథ్వీ షా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అర్మాన్ జాఫర్, సువేద్ పర్కర్, సర్ఫరాజ్ ఖాన్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ

Story first published: Thursday, June 23, 2022, 15:01 [IST]
Other articles published on Jun 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X