న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విదర్భకు గంభీర్ ప్రశంస: రన్నరప్‌గా నిలవడం అవమానం కాదు

By Nageshwara Rao
Ranji Trophy Final: Gautam Gambhir's Message For Vidarbha Wins The Ultimate Title

హైదరాబాద్: రంజీ క్రికెట్‌లో చరిత్రలోనే తొలిసారి టైటిల్‌ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విదర్భ జట్టుపై టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండోర్‌లోని హోల్కర్‌ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్‌ ఫైనల్‌లో ఢిల్లీపై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

రంజీ ట్రోఫీ: విడ్డూరం కాదిది విదర్భ ఘన విజయంరంజీ ట్రోఫీ: విడ్డూరం కాదిది విదర్భ ఘన విజయం

ఏడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విదర్భ విజేతగా నిలిచిన తర్వాత తన ట్విట్టర్ వేదికగా గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పైనల్లో విదర్భ జట్టు అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిందని గంభీర్ కొనియాడాడు.

'ఆద్యంతం ఆకట్టుకుని తొలిసారి రంజీ విజేతగా విదర్భ నిలిచింది. వెల్‌డన్‌ విదర్భ. ఆ జట్టుకు మంచి రోజులు రానున్నాయనడానికి ఇది సంకేతం. ఈ టైటిలే కాదు.. భవిష్యత్తులో ఇంతకంటే మంచి విజయాలను విదర్భ సొంతం చేసుకుంటుంది. ఫైజ్‌ఫజల్‌ గ్యాంగ్‌కు అభినందనలు' అని గంభీర్‌ ట్వీట్ చేశాడు.

విదర్భ రంజీ విజేతగా నిలవడంలో కీలకపాత్ర: ఎవరీ గుర్బానీవిదర్భ రంజీ విజేతగా నిలవడంలో కీలకపాత్ర: ఎవరీ గుర్బానీ

అదే సమయంలో 2017-18 సీజన్‌లో ఢిల్లీ జట్టు ప్రదర్శన కూడా గర్వించే విధంగానే ఉందని గంభీర్ పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలవడం ఎంతమాత్రం అవమానకరం కాదని ఈ సందర్భంగా అన్నాడు. తమ అత్యుత్తమ ప్రదర్శనతోనే ఫైనల్‌కు చేరామన్న గంభీర్‌, గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని చెప్పాడు.

నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో విదర్భ జట్టు ఆటగాడు అక్షయ్‌ వాడ్కర్‌ (133 బ్యాటింగ్‌; 262 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సు) కెరీర్‌లో తొలి సెంచరీతో విదర్భ జట్టుకి తొలి టైటిల్‌ని అందించాడు. దీంతో 83 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా విదర్భ అవతరించింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్‌ చేసిన విదర్భ వికెట్ కీపర్ అక్షయ్‌ వినోద్‌ వాడ్కర్‌ అజేయ సెంచరీతో 547 పరుగుల భారీ స్కోరుని సాధించింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఢిల్లీ జట్టు ఆశించిన మేర రాణించలేకపోయింది.

గౌతమ్ గంభీర్ (36), నితీశ్ రాణా (64), రిషబ్ పంత్ (32) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో 280 పరుగులకే ఢిల్లీ కుప్పకూలింది. అనంతరం 29 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ కేవలం 5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. దీంతో మైదానంలో విదర్భ ఆటగాళ్లు గెలుపు సంబరాలు చేసుకున్నారు.

రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు విజయం సాధించడంలో గుర్బానీ (6/59), అక్షయ్ వాడ్కర్‌ అజేయ సెంచరీనే కీలకపాత్ర పోషించాయి. ఈ రంజీ సీజన్ ప్రారంభమైన తొలి మ్యాచ్ నుంచే విదర్భ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

స్కోరు కార్డు వివరాలు:
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్
విదర్భ తొలి ఇన్నింగ్స్: 547 ఆలౌట్

ఢిల్లీ రెండో ఇన్నింగ్స్: 280 ఆలౌట్
విదర్భ రెండో ఇన్నింగ్స్: 32/1

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 2, 2018, 13:34 [IST]
Other articles published on Jan 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X