Ranji Trophy 2019-20: మైదానంలోకి పాము, భయపడ్డ ఆటగాళ్లు, నిలిచిన ఆట (వీడియో)

హైదరాబాద్: విజయవాడలో ఆంధ్ర-విదర్భ జట్ల మధ్య సోమవారం మొదలైన రంజీ మ్యాచ్‌లో అనుకోని అతిథి సందడి చేశాడు. ఫలితంగా మ్యాచ్‌ని అంపైర్లు కాసేపు నిలిపివేశారు. వివరాల్లోకి వెళితే... 2019-20 రంజీ సీజన్ సోమవారం ఆరంభమైంది. ఇందులో భాగంగా తొలిరోజు విజయవాడకు సమీపంలోని మూలపాడులో ఆంధ్ర vs విదర్భ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది.
అయితే, మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికీ ఓ పాము మైదానంలోకి వచ్చింది. అయితే, పాముని చూసిన ఆటగాళ్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు. అనంతం స్టేడియం నిర్వాహాక సిబ్బంది ఆ పామును బయటకు తరిమివేయడంతో మ్యాచ్ తిరిగి సజావుగా సాగింది.
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 29 ఓవర్లకు గాను ఆంధ్ర జట్టు 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. కాగా, గత సీజన్‌లో గ్రూప్-ఎలో ఆంధ్ర ఆరో స్థానం నిలిచింది. ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా హనుమ విహారి వ్యవహారిస్తున్నాడు.
ఈసారి రంజీ సీజన్‌లో భారత టెస్టు స్పెషలిస్టు పుజారా, రహానే, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లు బరిలో ఉన్నారు. డోపింగ్‌లో పట్టుబడి 8 నెలల నిషేధానికి గురైన యువ ఓపెనర్ పృథ్వీషా పునరాగమనం తర్వాత ఆడుతున్న పెద్ద టోర్నీ ఇదే కావడం విశేషం. రికార్డు స్థాయిలో 38 జట్లు ఈసారి టోర్నీ బరిలో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications