న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్ రాకతో మైండ్‌సెట్ మారింది: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌పై హర్మన్

Ramesh’s presence has changed our mindset, says Harmanpreet on new coach

హైదరాబాద్: వెస్టిండిస్ వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20లో భారత జట్టు వరుస విజయాలలో కోచ్‌ రమేశ్‌ పవార్‌ పాత్ర కీలకమని కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొన్నారు. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు గ్రూపు దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టీమిండియా గెలిచి సెమీస్‌ చేరుకుంది.

శుక్రవారం ఉదయం 5.30 గంటలకు

శుక్రవారం ఉదయం 5.30 గంటలకు

టోర్నీ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ జట్టుని మట్టికరిపించిన భారత్ జట్టు.. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా జట్లని లీగ్ దశలో ఓడించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం ఉదయం 5.30 గంటలకి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది.

హర్మన్ ప్రీత్ మీడియాతో మాట్లాడుతూ

ఈ నేఫథ్యంలో గురువారం హర్మన్ ప్రీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ "టీమ్‌లో ఆత్మవిశ్వాసం ఇప్పుడు రెట్టింపైంది. అలానే వ్యూహాల్లో మెరుగయ్యాం. పెద్ద లక్ష్యాలని నిర్దేశించుకున్నాం. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో కోచ్‌ రమేశ్‌ పవార్‌ది కీలకపాత్ర. అతని రాకతో టీమ్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది" అని వెల్లడించింది.

మరొక గేమ్‌గా మాత్రమే చూస్తున్నాం

ఇక ఇంగ్లాండ్‌తో రేపు సెమీస్‌ మ్యాచ్‌ని మరొక గేమ్‌గా మాత్రమే చూస్తున్నామని, లీగ్ దశలో ఆడినట్లే సెమీస్‌లోనూ ఆడతామని హర్మన్ చెప్పుకొచ్చింది. "ఇప్పుడు, మా ఆలోచనలన్నీ తర్వాతి మ్యాచ్‌ గురించి మాత్రమే. టోర్నీలో భాగంగా ఇది మరో మ్యాచ్‌ మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి ఏం చేయాలో దాని గురించే ఆలోచిస్తున్నాం" అని హర్మన్ పేర్కొంది.

ప్రపంచకప్‌లో ఓటమి ప్రభావం

"గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఓటమి ప్రభావం రేపటి మ్యాచ్‌లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది కాకుండా ఇది పూర్తిగా వేరే ఫార్మాట్‌. దీనికి తోడు జట్టు, కెప్టెన్‌.. ఇలా ఎన్నో రకాల మార్పులు వచ్చాయి" అని హర్మన్‌ చెప్పుకొచ్చింది. ఇంగ్లాండ్ వేదికగా గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌‌ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలోనే భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, November 22, 2018, 18:08 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X