న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వర్షంతో రద్దైన రెండో టీ20: అరుదైన ఘనతను కోల్పోయిన రాష్ట్రపతి

 Ram Nath Kovind to become first Indian President to attend cricket match abroad

హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అరుదైన ఘనతను కోల్పోయారు. ఇంతకీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కోల్పోయిన ఆ ఆరుదైన ఘనత ఏంటని అనుకుంటున్నారా? విదేశాల్లో అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన తొలి రాష్ట్రపతిగా ఘనత వహించే అవకాశాన్ని.

యాషెస్ కంటే భారత్-పాక్ టెస్టు సిరిస్ పెద్దది: షాహిద్‌ అఫ్రిదియాషెస్ కంటే భారత్-పాక్ టెస్టు సిరిస్ పెద్దది: షాహిద్‌ అఫ్రిది

సుదీర్ఘ పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో భాగంగా శుక్రవారం మెల్ బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 జరిగింది. అయితే, రాష్ట్రపతి రాకుండానే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

ఈ మ్యాచ్‌కు ముందు ఆయన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు మ్యాచ్ చూసేందుకు వస్తారని శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంది. "మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను రాష్ట్రపతి కోవింద్‌ వీక్షించనున్నారు. ఓ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ను విదేశాల్లో ప్రత్యక్షంగా వీక్షించే తొలి రాష్ట్రపతి ఆయనే కానున్నారు. కొద్ది సమయం ఆయన మైదానంలో ఉంటారు" ట్వీట్‌ చేసింది.

1
43621
ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన మెల్‌బోర్న్‌లో పర్యటించారు. ఇదిలా ఉంటే, మెల్‌బోర్న్ టీ20ని వరుణుడు వదిలిపెట్టకపోవడంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 రద్దు అయింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌ను సమం చేయాలంటే చివరి మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాల్సిందే.

 వర్షం కారణంగా రెండో టీ20 రద్దు

వర్షం కారణంగా రెండో టీ20 రద్దు

వర్షం కారణంగా ఆట రద్దు అవడం అభిమానులను నిరాశపరిచింది. మ్యాచ్‌ను తొలుత 19 ఓవర్లకు కుదించిన అంపైర్లు వర్షం తెరిపినివ్వకపోవడంతో మరోమారు ఓవర్లు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసినట్లుగా అంఫైర్లు ప్రకటించారు. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయ లక్ష్యాన్ని 137 పరుగులుగా నిర్ధారించారు. టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మైదానంలోకి అడుగుపెట్టారు.

తొలుత భారత్ లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించిన అంఫైర్లు

ఈ క్రమంలో మరోమారు వర్షం కురిసింది. దీంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లను అలాగే ఉంచారు. ఆ తర్వాత వర్షం కాసేపు తగ్గుముఖం పట్టడం, ఆటగాళ్లు మైదానంలోకి రావడం, మళ్లీ వర్షం రావడం జరిగింది. దీంతో భారత లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించారు. వర్షం ఆగితే స్థానిక కాలమానం ప్రకారం 22:02 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైతే కోహ్లీసేన 5 ఓవర్లకు 46 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది.

వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే

వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే

ఆ తర్వాత వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే అంఫైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ నిలవడం ఇది రెండోసారి కావడం విశేషం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లోనూ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచింది. దీంతో దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో భారత్‌కు 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఖలీల్‌ అహ్మద్‌ 27 వద్ద క్రిస్‌లిన్‌ (13)ను, జట్టు స్కోరు 35 పరుగుల వద్ద డీఆర్సీ షార్ట్‌ (14)ను ఔట్‌ చేశాడు.

7 ఓవర్లు ముగిసే సరికి 41/4తో నిలిచిన ఆసీస్‌

7 ఓవర్లు ముగిసే సరికి 41/4తో నిలిచిన ఆసీస్‌

ఆ తర్వాత కాసేపటికే ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ (4)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 41/4తో నిలిచింది. ఎక్కువ పరుగులు చేయాలన్న ఉద్దేశంతో భారీ షాట్లకు ప్రయత్నించి బ్యాట్స్‌మెన్‌ వికెట్లు కోల్పోయారు. దీంతో ఆసీస్‌ ఒత్తిడిలో పడింది. కుల్దీప్‌, కృనాల్‌ తమ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. తొలి టీ20లో పరుగుల వరద పారించిన గ్లెన్ మాక్స్‌వెల్‌ (19)ను పాండ్యా, అలెక్స్‌ కారె (4)ను కుల్దీప్‌ ఔట్ చేశారు. కౌల్టర్‌ నైల్‌ (18) రెండు భారీ సిక్సర్లతో బెంబేలెత్తించినా అతడిని భువి పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఖలీల్ బౌలింగ్‌లో ఆసీస్ 19 పరుగులు 19వ ఓవర్లో బుమ్రా 10 పరుగులు ఇవ్వడంతో స్కోరు పెరిగింది.

19 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి

19 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి

17వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. 19 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 19 ఓవర్లకు ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన దశలో వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, ఖలీల్ చెరో రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, కుల్‌దీప్, కృనాల్ తలా ఒక వికెట్ తీశారు.

Story first published: Saturday, November 24, 2018, 10:27 [IST]
Other articles published on Nov 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X