న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Dhoni-Parag: ఎంఎస్ ధోనీతో రియాన్‌ పరాగ్‌ని చూస్తే షాకే!!

Rajasthan Royals Post Riyan Parags Old Photo with MS Dhoni
From Fan to Contemporary, RR Posts Snap | Oneindia Telugu

హైదరాబాద్: రియాన్‌ పరాగ్‌.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మ్యాచ్‌లను వీక్షించేవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 19 ఏళ్ల యువ ఆల్‌రౌండర్‌.. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే పరాగ్‌.. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు చేయడమే లక్ష్యంగా ఆడతాడు. అవసరమైనప్పుడు బౌలింగ్‌లోనూ సత్తాచాటుతాడు. అంతేకాదు వినోదాన్ని పంచడంలో ముందుంటాడు. ఇలా అన్ని విధాలా మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందుతున్నాడు.

French Open:52వ ప్రయత్నంలో పవ్లిచెంకోవా సక్సెస్..క్రెజికోవాతో టైటిల్‌ ఫైట్‌!French Open:52వ ప్రయత్నంలో పవ్లిచెంకోవా సక్సెస్..క్రెజికోవాతో టైటిల్‌ ఫైట్‌!

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీతో రియాన్‌ పరాగ్‌ దిగిన ఫొటోను రాజస్థాన్‌ రాయల్స్‌ తాజాగా ట్వీట్‌ చేసింది. ఇందులో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. పరాగ్‌ ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ధోనీతో కలిసి దిగిన ఫొటోని, 2019లో రియాన్‌ ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పుడు మహీతో దిగిన ఫోటోని పక్కపక్కన ఉంచుతూ పోస్ట్ చేసింది. 'మొదలుపెట్టు, నేర్చుకో, ఎదుగు' అనే కాప్షన్ రాజస్థాన్‌ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోనీతో కలిసి దిగిన రియాన్‌ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ 14 సీజన్‌లో రియాన్‌ పరాగ్‌.. 7 మ్యాచ్‌ల్లో 78 పరుగులు సాధించి ఒక వికెట్‌ పడగొట్టాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆడిన ఏడు మ్యాచులలో మూడు విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. కొత్త కెప్టెన్ సంజూ శాంసన్ సారథ్యంలో యూత్ ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. ఈ సీజన్లో పరాగ్‌ రౌండ్‌ ఆర్మ్ బౌలింగ్‌ వేశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేశాడు‌. బంతి వేసే సమయంలో అతని మోచేతి గ్రౌండ్‌కు దాదాపు సమాంతరంగా ఉండటంతో అంపైర్‌ వార్నింగ్ ఇచ్చాడు. రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేస్తే నిబంధనలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు. దాంతో వెంటనే పరాగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మార్చేశాడు.

ఐపీఎల్ 14 సీజన్‌లో రాజస్తాన్‌ జట్టు యువ ఆటగాళ్లైన రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియాలు మైదానంలో తమ చర్యలతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఈ ఇద్దరు క్రికెట్‌లో కొత్త తరహా సెల్రబ్రేషన్స్‌కి తెరదీశారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ బౌండరీ లైన్ వద్ద రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. క్యాచ్ పట్టగానే ఆ పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న తెవాటియాని పిలవడం.. అతను తనని సమీపిస్తున్న సమయంలో ఓ మొబైల్ ఫోన్‌ని జేబులో నుంచి తీసి తెవాటియాకి విసురుతున్నట్లు రియాన్ యాక్షన్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బంతితో సెల్ఫీ దిగుతున్నట్లు మైదానంలో పోజులిచ్చారు.

Story first published: Friday, June 11, 2021, 9:15 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X