న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

tribute to shane warne: షేన్ వార్న్‌కు నివాళిగా రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేక వీడియో..

Rajasthan Royals pay tribute to Shane Warne through special video

2008లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిపి ట్రోఫీని ముద్దాడింది. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ కెప్టెన్సీ వహించాడు. తొలుత అనామక జట్టు అనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఏకంగా టైటిల్‌ను ఎగరవేసుకుపోవడంలో షేన్ వార్న్ సారథ్యం కీలకమైంది.

ఇటీవల మార్చి 4న థాయ్‌లాండ్‌లో షేన్ వార్న్ (52) ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 52ఏళ్ల షేన్ వార్న్ ఆల్ టైం బెస్ట్ క్రికెటర్లలో ఒకరు. అతనికి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కెప్టెన్‌గానే కాకుండా మెంటార్‌గానూ అవినవభావ అనుబంధం ఉంది. ఈ క్రమంలో తమ మొట్టమొదటి రాయల్ షేన్ వార్న్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు స్మరించుకుంది. షేన్ వార్న్ తొలి టైటిల్ అందించిన స్టేడియం అయిన డీవై పాటిల్ స్టేడియంలో ఏప్రిల్ 30 అయిన ఇదే రోజు ముంబై ఇండియన్స్‌తో రాయల్స్ తలపడనుంది. ఈ క్రమంలో షేన్ వార్న్‌కు ప్రత్యేక వీడియో ద్వారా ఘన నివాళులర్పించింది.

 ప్రతి క్రికెటర్‌కి అతను ప్రత్యేకం

ప్రతి క్రికెటర్‌కి అతను ప్రత్యేకం

నేటి మ్యాచ్‌లో వార్న్ జ్ఞాపకార్థం.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌పై ప్రత్యేక జెర్సీని ధరించాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక ట్విట్టరు హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో.. వార్న్‌ను రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు స్మరించుకున్నారు. అతనితో తాము గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. వార్న్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి క్రికెటర్‌కి అతనో ప్రత్యేకమైన వ్యక్తి అని పేర్కొన్నాడు. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. వార్న్ తన చుట్టూ ఉన్న వాళ్లలో కాన్ఫిడెంట్‌ను నింపి తమ మీద తమకు నమ్మకం కలిగిస్తాడని తెలిపాడు. బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మాట్లాడుతూ.. 'అతను ఏం ఆశించాడో ఎల్లప్పుడూ అవి అతనితోనే ఉంటాయని' స్మరణపూర్వకంగా తెలిపాడు.

ఇంకా టీంతో పాటే వార్న్ ఉన్నట్లు భావిస్తున్నారు

టీమ్ మేనేజర్ రోమి భిందర్ మాట్లాడుతూ.. రాజస్థాన్ ఆటగాళ్లు ఇప్పటికీ తమతో పాటే వార్న్ ఉన్నట్లు భావిస్తున్నారని.. వార్న్ అందించిన వారసత్వం అలాంటిదని పేర్కొన్నాడు. మొన్నామధ్య జాస్ బట్లర్ గోడకు ఉన్న వార్న్ ఫోటోకు హై ఫై ఇవ్వడం బట్టి వార్న్ ఇంకా మాతో పాటు ఉన్నాడనే ఫీలింగ్‌లో ప్లేయర్లు ఉన్నారని పేర్కొన్నాడు.

 తొలి ఐపీఎల్ వివరాలు

తొలి ఐపీఎల్ వివరాలు

2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ సీజన్లో వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవగా.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్‌ను పొందాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సోహిల్ తన్వీర్ పర్పుల్ క్యాప్‌ని పొందాడు. షేన్ వాట్సన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఫైనల్లో యూసుఫ్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Story first published: Saturday, April 30, 2022, 16:21 [IST]
Other articles published on Apr 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X